Thaman Video: మీకు దండం పెడతా.. అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. వీడియో వైరల్..

Thaman comments on wedding: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 7, 2025, 04:29 PM IST
  • పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్..
  • షాక్ అవుతున్న యువత..
Thaman Video: మీకు దండం పెడతా.. అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. వీడియో వైరల్..

Thaman shocking comments on wedding: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల యువత ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం యువత ఆలోచణ ధోరణి పూర్తిగా మారిపొయిందన్నారు. ముఖ్యంగా యువతపై సోషల్ మీడియా, ఇన్ స్టా ప్రభావం విపరీతంగా ఉంటుందన్నారు. ఎవరికి వారు ప్రైవసీ కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు.

Add Zee News as a Preferred Source

 ఒక వేళ ఎవరైన తనను పెళ్లి చేసుకొవాలా అని అడిగితే.. మోహమాటంలేకుండా.. పెళ్లి వద్దని చెప్తానని అన్నారు. యువత ఆలోచనల్లో మార్పులు వచ్చాయన్నారు.  అంతే కాకుండా.. వీరికి పెళ్లిపై సరైన ఒపినియన్ కానీ.. సీరియస్ నెస్ కానీ లేదన్నారు. అందుకు ఇటీవల కాలంలో పెళ్లి అయిన కొన్ని నెలలకే డైవర్స్ లు జరిగిపోతున్నాయని అన్నారు. యువత ప్రతి చిన్న విషయాల్ని భూతద్దంలో చూస్తున్నారని అన్నారు.

 

 ఒకరికి మరోకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలన్న ధోరణి లేకుండా పోయిందన్నారు. మరికొందరు తనదే నడవాలని కూడా మొండి పట్టుదలతోముందుకు వెళ్తున్నారని అన్నారు. వైవాహిక జీవితం అంటే ఇద్దరు కలిసి ఒక నావ మీద ముందుక వెళ్లడం.. కానీ ఎవరికి వారు ఒకవైపు, మరోవైపు ఎడముఖం, పెడముఖం అంటే.. ఈ జీవితం అనే నావ నడి సంద్రంలో మునిగిపోతుందని కూడా తమన్ అన్నారు.

Read more: Viral Video: కుంభమేళలో విజయ్ దేవర కొండ.. రష్మిక ఎక్కడ బ్రో అంటున్న ఫ్యాన్స్ .. వీడియో వైరల్..

అయితే.. పెళ్లిపై తమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. అసలే.. ఇటీవల యువత పెళ్లిళ్లంటే ఆమడ దూరం పారిపోతున్నారు. అలాంటి క్రమంలో ఒక సెలబ్రీటీ, స్టార్ మ్యూజీక్ డైరెక్టర్ పెళ్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News