Mahesh Babu: రాజమౌళి 'వారణాసి'తో మా నాన్న కృష్ణ కోరిక నెరవేరింది: హీరో మహేశ్ బాబు

SS Rajamouli Varanasi Movie Mahesh Babu: సినిమా సినిమాకు రేంజ్‌ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటుడిగా తీస్తున్న వారణాసి సినిమా టైటిల్‌ విడుదల విడుదల చేశారు. ఈ వేడుకలో మహేశ్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 15, 2025, 11:45 PM IST
Mahesh Babu: రాజమౌళి 'వారణాసి'తో మా నాన్న కృష్ణ కోరిక నెరవేరింది: హీరో మహేశ్ బాబు

SS Rajamouli Varanasi Movie: సంచలన సినిమాలు తీస్తున్న ఎస్‌ఎస్‌ రాజమౌళి గ్లోబ్‌ ట్రోటర్‌ పేరిట నిర్వహించిన భారీ వేడుకలో మహేశ్‌ బాబు సినిమా టైటిల్‌, విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు భారీ స్పందన లభించింది. అనంతరం సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా.. పాత్ర ఒకటి ఉంటుంది అని తెలిపారు. తనకు ‘వారణాసి’ సినిమా అలాంటిదేనని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ 'వారణాసి' సినిమా మహేశ్‌బాబుతో చేస్తుండగా.. అతడికి జోడీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా  నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్‌ ట్రోటర్‌ పేరిట శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్వహించారు. వారణాసి సినిమా టైటిల్‌, స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. తనను, తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానుల రుణం తీర్చుకోలేనిదని మహేశ్‌ బాబు ప్రకటించారు.

Also Read: Ticket Price Hike: భక్తులకు భారీ షాక్‌.. అడ్డగోలుగా కొండగట్టు ఆలయ ధరల పెంపు

'అభిమానులను కలుసుకుని చాలా రోజులైంది. ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను సాధారణంగా వస్తానని చెప్పా. కానీ రాజమౌళి ఇలా స్పెషల్‌గా మీ ముందుకు తీసుకొచ్చారు' అని మహేశ్ బాబు వివరించారు. 'నాన్న కృష్ణ ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు' అని మహేశ్‌ బాబు తెలిపారు. నాన్న కృష్ణ ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని పేర్కొన్నారు.

Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడులు.. మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

వారణాసి చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. రాజమౌళి భార్య రమా క్యాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉన్న టీమ్‌తోనే రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ వేడుకలో విడుదల చేసిన వారణాసి టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. రుద్ర పాత్రలో మహేశ్ బాబు సరికొత్త లుక్ లో కనిపించాడు. పోకిరిలో కనిపించిన యువ మహేశ్ బాబుగా ఉన్నాడు. వారణాసి సినిమాతో మహేశ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News