Naga Chaitanya Baby: సమంతకి కుళ్లుపుట్టే వార్త..తండ్రి కాబోతున్న అక్కినేని వారసుడు..ఏం జరిగిందంటే?

Naga Chaitanya Become Father: కింగ్ నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ చైతన్య.. జోష్ సినిమాతో నటుడిగా సినీరంగం ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన మార్క్ సినిమాలతో అలరిస్తున్న చైతన్య.. ఇప్పుడు తన జీవితం మరో ముఖ్యమైన ఘట్టానికి వచ్చారు. ఇప్పుడదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Harish Darla | Last Updated : Dec 15, 2025, 06:12 PM IST
Naga Chaitanya Baby: సమంతకి కుళ్లుపుట్టే వార్త..తండ్రి కాబోతున్న అక్కినేని వారసుడు..ఏం జరిగిందంటే?

Naga Chaitanya Become Father: కింగ్ నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ చైతన్య.. జోష్ సినిమాతో నటుడిగా సినీరంగం ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన మార్క్ సినిమాలతో అలరిస్తున్న చైతన్య.. ఇప్పుడు తన జీవితం మరో ముఖ్యమైన ఘట్టానికి వచ్చారు. ఇప్పుడదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Add Zee News as a Preferred Source

అక్కినేని నాగచైతన్య తండ్రి కాబోతున్నారట. ఆయన భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ గర్భం దాల్చినట్లు ఇప్పుడు టాలీవుడ్‌లో తెగ చర్చ జరుగుతోంది. అక్కినేని వారసుడు తండ్రి కాబోతున్నాడనే వార్త ఇప్పుడు వాళ్ల ఫ్యాన్స్‌కు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం సోషల్ మీడియాలో.. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం మాత్రమే. దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

'ఏం మాయ చేశావే' చిత్రం ద్వారా తొలి హిట్ అందుకున్న నాగచైతన్య అదే సినిమాలోని హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డారు.  ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా.. ఆ తర్వాత వివాహానికి దారితీసింది. 2017లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల 2021 ఏడాదిలో వీరిద్దరూ విడిపోయారు.  

నాగ చైతన్య, శోభిత రెండో వివాహం
సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న హీరో నాగ చైతన్య.. గతేడాది ప్రముఖ నటి శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 4న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవలే వీరిద్దరి వారి మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోగా.. ఇంతలో ఈ శుభవార్త రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

శోభిత ధూళిపాళ హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో ఆమె పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. నాగ చైతన్య, శోభిత చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం తర్వాత ఇద్దరూ సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.

మాజీ భార్య సమంత గురించి..
మరోవైపు నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా విడాకుల తర్వాత అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు మయోసైటిస్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తన రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకోని.. ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతుంది.

Also Read: Bizarre News: నెలకు రూ.1.31 కోట్ల జీతం..కానీ జాబ్‌ను వదిలేస్తున్నాడు..కారణం తెలిస్తే ఇరగదీస్తారు!

Also Read: IPL 2026 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మినీ వేలం..ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే? పూర్తి వివరాలివే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News