Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..

Thandel OTT Steaming date: అక్కినేని నాగ  చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2025, 01:48 PM IST
Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..

Thandel OTT Steaming date: అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారులు అనుకోకుండా పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కుతారు. దీంతో వాళ్లను అక్కడ జైల్లో ఉంచుతారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దాన్ని చందూ మొండేటి ఎంతో భావోద్వేగ భరితంగా తెరకెక్కించాడు.  అది వసూళ్ల వర్షం కురిపించింది.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రూ. 59 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా అక్కినేని హీరోల్లో ఈ జమానాలో రూ. 100 కోట్ల గ్రాస్ అనేది మాములు విషయం కాదు. మొత్తంగా వరుసగా కెరీర్ లో రెండు డిజాస్టర్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ చిత్రం హీరోగా నాగ చైతన్యకు మంచి ఊపు ఇచ్చింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అంతేకాదు శోభితతో రెండో పెళ్లి తర్వాత  దక్కిన తొలి విజయం. ఓ రకంగా శోభిత చైతూ జీవితంలో వచ్చిన తర్వాత దక్కిన తొలి సక్సెస్ కావడంతో అక్కినేని ఫ్యామిలీకి ఇది ప్రత్యేకమైన సినిమాగా చెప్పాలి. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News