Thandel OTT Steaming date:‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో అదే స్పెషల్.. డోంట్ మిస్..

Thandel OTT Steaming date: అక్కినేని నాగ  చైతన్య కథానాయకుడిగా  సాయి పల్లవి నాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్ ల  తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. అయితే ఓటీటీ వెర్షన్ లో సినిమాలో  చూపెట్టని 20 నిమిషాల అదనపు కంటెంట్ ను చూపించబోతున్నట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 03:57 PM IST
Thandel OTT Steaming date:‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో అదే స్పెషల్.. డోంట్ మిస్..

Thandel OTT Steaming date: అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘తండేల్’. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా  నిలిచింది. చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారుల బృందం అనుకోకుండా పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కుతారు. దీంతో వాళ్లను అక్కడ కరాచీ జైల్లో ఉంచుతారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది. అందుకోసం కథానాయికగా ఏం చేసిందనేదే ‘తండేల్’ మూవీ స్టోరీ.

Add Zee News as a Preferred Source

పాకిస్థాన్ ముష్కర మూకల చెరలో చిక్కుకున్న వాళ్ల వ్యథను చందూ మొండేటి ఎంతో భావోద్వేగ భరితంగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో భారీ వసూళ్లను దక్కించుకుంది. ఏకంగా రూ. 65 కోట్ల షేర్ (రూ. 103 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కెరీర్ లో వరుసగా రెండు డిజాస్టర్స్ తర్వాత హీరోగా నాగ చైతన్యకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అంతేకాదు శోభితతో షాదీ తర్వాత నాగ చైతన్యకు హీరోగా ఫస్ట్ సక్సెస్ ఈ సినిమాతో అందుకోవడం విశేషం. శోభిత చైతూ లైఫ్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ హిట్ అందుకున్నాడు. దీంతో అక్కినేని కుటుంబానికి ఈ సినిమా ప్రత్యేకం అని చెప్పాలి. ఇక  సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు రానుంది. ఓటీటీలో సినిమాలో చూపెట్టని కొన్ని అదనపు సీన్స్ తో రానుంది. మరి థియేట్రికల్ మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News