Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!

Naga Chaitanya Sobhita Wedding Anniversary: టాలీవుడ్ సెలబ్రిటీ జోడీ అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ఇటీవలే తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నటి శోభిత ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. అయతే ఈ క్రమంలో ఇటీవలే నాగచైతన్యతో పెళ్లిపై శోభిత దూళిపాళ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. 

Written by - Harish Darla | Last Updated : Dec 13, 2025, 03:49 PM IST
Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!

Naga Chaitanya Sobhita Wedding Anniversary: టాలీవుడ్ సెలబ్రిటీ జోడీ అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ఇటీవలే తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నటి శోభిత ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. అయతే ఈ క్రమంలో ఇటీవలే నాగచైతన్యతో పెళ్లిపై శోభిత దూళిపాళ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

"పెళ్లి తర్వాత అందరి జీవితం ఒకేలా ఉంటుందని నేను అస్సలు భావించను. కానీ ప్రస్తుతం నేను అనుభవిస్తున్న జీవితం ఎంతో భిన్నంగా ఉంది. పెళ్లైన తర్వాత నాగచైతన్యతో హైదరాబాద్ సిటీ మొత్తం చుట్టేస్తూ టైమ్ స్పెండ్ చేయాలని అనుకున్నా. కానీ, నిజం చెప్పాలంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. ఇద్దరికీ సినిమా షూటింగ్స్ కారణంగా నేను కన్న కల ఇప్పటికీ నెరవేరలేదు" అని శోభిత చెప్పుకొచ్చింది.

నాగచైతన్యతో పెళ్లైన తర్వత 160 రోజుల పాటు షూటింగ్‌లో సమయం గడిపినట్లు శోభిత గుర్తుచేసుకుంది. అయితే సినిమా చిత్రీకరణల కోసం దాదాపుగా తమిళనాడులోని ఎక్కువ రోజులు గడపాల్సి వచ్చిందని చెప్పింది. పెళ్లి తర్వాత భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకున్నా.. షూటింగ్ కారణంగా ఎన్నో రోజులు దూరంగా గడపాల్సి వస్తుందని అనుకోలేదని.. ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదని  శోభితా చెప్పుకొచ్చింది.

హీరో నాగచైతన్య, శోభిత సినిమాల కారణంగా ఇరువురు వారి రిలేషన్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారట. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. నచ్చిన వారి కోసం సమయం కేటాయించడంలోనే అసలైన ప్రేమ ఉంటుందని శోభిత దూళిపాళ చెప్తోంది. మనసులో ప్రేమ లేకపోతే చిన్న విషయమైనా పెద్ద భారంగా మారిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఏదైనా బంధంలో పరస్పర ప్రేమ, అవగాహన ఉంటే.. సమయం దొరకడం అనేది పెద్ద సమస్య కాదని శోభిత నమ్ముతోంది. తమ పెళ్లి మొదటి వార్షికోత్సవం ఎంతో అందంగా, సంతోషంగా గడిచిందని శోభిత చెప్పుకొచ్చింది. మ్యారేజ్ లైఫ్ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని.. చిత్రసీమపై తనకు ఉన్న ప్రేమ మరింత పెరిగందని చెప్పింది. తన టాలెంట్‌ను ప్రోత్సహించే కుటుంబాన్ని.. ముఖ్యంగా తన భర్త నుంచి తగినంత ప్రోత్సాహం లభించిందని శోభిత చెప్పుకొచ్చింది.

ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమ, కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ జంట ముందుకు సాగుతుందని వారి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా విలువలతో కూడిన వైవాహిక జీవితం సాధ్యమేనంటూ నిరూపించినందుకు వీరిద్దరిపై పలువురు విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: School Holidays: డిసెంబర్ 13, 14, 15, 16, 17, 18, 19 తేదీల్లో స్కూళ్లకు సెలవులు..విద్యార్థులు పండగ చేసుకోండి!

Also REad: Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్..ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News