Nagarjuna 100th Movie: నాగార్జున టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెనకబడ్డాడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ వంటి హీరోలు సోలో హీరోగా వందల కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ నాగ్ మాత్రం సోలో హీరోగా రూ. 100 కోట్ల సినిమా ఏది చేయలేదు. అందుకే తన 100వ సినిమాతో సోలో హీరోగా రూ. 100 కోట్ల క్లబ్బులో ప్రవేశించాలని ఉబలాటపడుతున్నాడు. నాగ కూడా సోలో హీరోగా సక్సెస్ అందుకొని చాలా కాలమే అవుతోంది. చాలా యేళ్ల క్రితం సంక్రాంతి సీజన్ లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగ్ ను వరుస ఫ్లాపులు పలకరించాయి. ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో ఓకే అనిపించాడు. ఆ తర్వాత ‘నా సామిరంగ’ కూడా ఓ మోస్తరుగా నడిచింది.
ఈ యేడాది ధనుశ్ తో ‘కుబేర’ సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు చాయలున్న పాత్రలో మంచి నటనే కనబరిచాడు. ఆ తర్వాత రజినీకాంత్ ‘కూలీ’లో సైమన్ అనే స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాతో తన అభిమానుల నుంచి విమర్శలు అందుకున్నాడు. మా హీరోగానే చేయాలి. విలన్ గా చేయడమేమిటి అని కింగ్ పై కారాలు మిరియాలు నూరారు. నటుడిగా కొత్త ప్రయత్నమే అయినప్పటికీ విలన్ గా నాగ్ ను ఆ పాత్రలో చూడలేము బాబోయ్ అన్నారు తెలుగు ఆడియన్స్.
అంతేకాదు అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. నాగార్జున ఇకపై ఇలాంటి క్యారెక్టర్స్ చేయద్దు మహా ప్రభో అంటూ అల్టీమేట్ జారీ చేశారు. హీరోగా విలన్స్ ను కొట్టే మీరు.. మరో కథానాయకుడిగాతో తన్నులు తినే పాత్రలో చూడలేకపోయామంటూ వాపోయారు. మరోవైపు నాగ్ .. ఇలాంటి తరహా పాత్రలను ఓకే చేయడాన్ని క్రిటిక్స్ మెచ్చుకుంటున్నారు. మూస తరహా పాత్రలే కాదు.. ఇలాంటి పాత్రలు చేయడం నాగ్ కే చెల్లిందంటున్నారు. తాజాగా నాగార్జున తన వందో చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా మొత్తం గ్లాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నాగ్ ను అభిమానులు ‘కింగ్’ అని పిలుస్తుంటారు. మరి ఈయన చిత్రానికి ‘లాటరీ కింగ్’ టైటిల్ పెట్టడమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ టైటిల్ తో నాగార్జున తన కెరీర్ లో మరో మెమబరబుల్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









