Nagarjuna Hair Wig:
టాలీవుడ్లో నవమన్మధుడుగా.. పేరుపొందిన హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూనే... మరొకవైపు పలు చిత్రాలను కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు నాగార్జున.
ఈ ఏడాది అటు తన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లిని కూడా చాలా గ్రాండ్ గానే చేశారు నాగార్జున. నాగార్జున వయసు 65 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా యంగ్ హీరోగా కనిపిస్తూ ఉంటారు. నాగార్జునను చూసి చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ వయసులో కూడా నాగార్జున అలా కనిపించడంతో ఆశ్చర్యపోతూ ఉంటారు.
తాజాగా నాగార్జున ఏదో ఫంక్షన్ లో ఉండగా అసలు నిజం బయటపడింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, భార్య శోభిత కలిసి నడుచుకుంటూ వస్తున్న సమయంలో వారి కోసం అటువైపుగా తిరగగా.. నాగార్జునకు బట్టతల ఉన్నట్లుగా చాలా క్లియర్ గా ఈ వీడియోలో కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే నాగార్జున హెయిర్ స్టైల్ కూడా ఒరిజినల్ కాదని విగ్గు అన్నట్లుగా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది నేటిజన్స్ నాగార్జున ఇన్ని రోజులు తన విగ్గుతో బాగానే మెయింటైన్ చేశారూ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక తన ఇద్దరి కుమారుల వివాహం పూర్తి చేసిన నాగార్జున ఒకవైపు తన కుమారుల సినిమాల సక్సెస్ కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే కుబేర చిత్రంలో నాగార్జున అద్భుతమైన పాత్రలో నటించి, మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే రజినీకాంత్ తో కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు.
అలాగే బిగ్ బాస్ 9 వ సీజన్ కి కూడా హోస్టుగా చేయడానికి సిద్ధమవుతున్నారు నాగార్జున. మరి ఇలాంటి సమయంలో నాగార్జునకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Strait of Hormuz : హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్.. భారత్ పై ప్రభావం ఎంత.. !
Also Read: FD Scheme: ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టి చూడండి.. లక్షల్లో లాభాలు ఖాయం..!
You May Like
బరువు తగ్గడానికి సులభమైన మార్గం - రాత్రికి కేవలం ఒక చెంచా!ONE TWO SLIM
దీన్ని ఒక్కసారి తినండి మీ పురుష బలం 10 రెట్లు పెరుగుతుంది.TANTRA MAX
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









