)
Kuberaa 2days World Wide Box Office collections: నాగార్జున, ధనుశ్ హీరోలుగా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’. మొత్తంగా బాక్సాఫీస్ కమర్షియల్ హంగులకు దూరంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ఇక ధనుశ్.. ‘సార్’ మూవీ తర్వాత తెలుగులో డైరెక్ట్ గా నటించిన చిత్రం రెండో చిత్రమిది. కుబేర సినిమాలో ధనుశ్ ఓ బిచ్చగాడి పాత్రలో జీవించాడు. బిచ్చగాడు.. ఓ మిలీయనీర్ కు బినామీగా తీసుకొస్తాడు నాగార్జున.
మొత్తంగా భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా క్లాస్ తో పాటు మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. పైగా ధనుశ్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. నాగార్జున కూడా ‘నా సామిరంగ’ హిట్ తర్వాత నటించిన చిత్రం కావడం ఇందులో పాత్రకు తగ్గట్టు నాగ్ చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓ బిచ్చగాడి పాత్రలో ధనుశ్ నటనను మెచ్చుకోకుండా ఉండలేము. మరోవైపు రష్మిక కూడా తన పాత్రలో ఒదిగిపోయిన తీరును మెచ్చుకోకుండా ఉండలేము.
కుబేర సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.05 గ్రాస్ (రూ. 15.25 కోట్ల షేర్)..
రెండో రోజు.. రూ. 22.77 కోట్ల గ్రాస్ (రూ.11.55 కోట్ల షేర్) రాబట్టింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు.. రూ. 6.75 కోట్లు షేర్
రెండో రోజు కుబేర మూవీ రూ 7.21 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తంగా రెండో రోజుల్లో కుబేర మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాలు.. రూ. 24.10 కోట్ల గ్రాస్..
తమిళనాడు.. రూ. 9.10 కోట్ల గ్రాస్..
కర్ణాటక..రూ. 3.80 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 0.52 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ భారత్ + హిందీ.. రూ. 1.20 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ‘కుబేర’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 52.82 కోట్ల గ్రాస్ (26.80 కోట్ల షేర్) రాబట్టింది.
కుబేర మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 39.20 కోట్ల రాబట్టాల్సి ఉంది. ఈ రోజు ఆది వారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు రాబడుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.