Kuberaa Overseas Review: నాగార్జున, ధనుశ్ ‘కుబేర’ ఓవర్సీస్ టాక్ ..!

Kuberaa Overseas Review: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కొన్ని చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ వేసారు. మరి అక్కడ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 20, 2025, 12:20 AM IST
Kuberaa Overseas Review: నాగార్జున, ధనుశ్ ‘కుబేర’ ఓవర్సీస్ టాక్ ..!

Kuberaa Overseas Review: ఈ సమ్మర్ లో బడా హీరోలెవరు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఏవో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విడుదలై ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టాయి. తాజాగా శేఖర్ కమ్ముల తన మార్గంలోనే వెళుతూనే సరికొత్తగా తెరకెక్కించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘కుబేర’. నాగార్జున, ధనుశ్ కాంబినేషన్ ఈ సినిమా పై అంచనాలు పెంచాయి. పైగా గత కొద్ది రోజులుగా హీరోగా నాగార్జున ఫామ్ లో లేరు. అటు ధనుశ్.. తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమలో తన కంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. పైగా క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే నటుల్లో ధనుశ్ ఒకరు. 

తన ఏజ్ కంటే ఎక్కువ వయసు పాత్రలో కనిపించి జాతీయ అవార్డు అందుకున్న ఘనత ధనుశ్ దే. ఓవర్సీస్ విడుదలైన ఈ సినిమాపై అక్కడి ఆడియన్స్ ఈ సినిమాలో ధనుశ్ నటన బాగుందని మెచ్చుకుంటున్నారు. మరోవైపు నాగార్జున సీబీఐ ఆఫీసర్ పాత్రలో శేఖర్ కమ్ముల చూపించిన విధానం, ప్రస్తుతం రాజకీయాలు, వ్యాపారాలు అయిన వేళ.. ఓ పొలిటికల్ ఇష్యూను ఈ సినిమాలో చూపించడం.. అవి ప్రస్తుత సమాజానికి కనెక్ట్ అయ్యేలా ఉన్నదట్టు అక్కడి ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.  మొత్తంగా నాగార్జున, ధనుశ్ కాంబో వర్కౌట్ అయినట్టే  చెబుతున్నారు. కొన్ని చోట్ల శేఖర్ కమ్ముల రొటిన్ సినిమా తీసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిక్స్ డ్ టాక్ తో ‘కుబేర’  ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి. 

కుబేర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు  తమిళనాడులో 300.. నార్త్ భారత్, కర్ణాటక కలిసి 250 టాకీస్ లలో కుబేర విడుదల అవుతుంది. ఇక విదేశీల్లో వివిధ భాషల్లో కలిపి 450 టాకీస్లలలో విడుదలైంది. దునియా మొత్తంలో 1700 టాకీస్ లలో ఈ కుబేర చిత్రం రిలీజ్ అవుతోంది. 

ఇక బుకింగ్ ట్రెండ్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల షేర్ రావచ్చొని చెబుతున్నారు. తమిళనాడులో కూడా రూ. 5 కోట్ల వరకు రావచ్చు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఫస్ట్ డే ఏ మేరకు రాబడుతుందో చూడాలి. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

Trending News