
Kubera Records: అక్కినేని నాగార్జున తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి అందరు ఔరా అంటున్నారు. ఈ పాత్రలో ధనుశ్ తప్పించి మిగిలిన తెలుగు హీరోలెవరు ఈ డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ఒప్పుకోరు. మొత్తంగా కథ డిమాండ్ మేరకు ‘కుబేర’ మూవీలో తన యాక్టింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు.
కుబేర సినిమా తొలిరోజే రికార్టు స్థాయిలో కలెక్ఠన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కుబేర సినిమా రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో రూ. 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ‘కుబేర’ మూవీ ఆదివారం.. మరో రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఓవరాల్ గా రూ. 70 కోట్ల గ్రాస్. రూ. 38 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే $ 1.5 మిలియన్ యూఎస్ డాలర్స్ ను రాబట్టిన ‘కుబేర’ చిత్రం త్వరలో $2 మిలియన్స్ రాబట్టే దిశగా దూసుకుపోతుంది.
ధనుష్ , నాగార్జున , రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేర సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే ఓ బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన చిత్రం కుబేర. దేవా పాత్రలో ధనుష్, దీపక్‌గా నాగార్జున నటించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.