Nagarjuna: కూలీ మూవీ నుండి నాగ్ డైలాగ్స్ లీక్.. విలనిజంతో రెచ్చిపోయారుగా..!

Viral Video: రజినీకాంత్ నటించిన కూలీ సినిమా నుంచీ నాగార్జున డైలాగ్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా  మారింది. ముఖ్యంగా ఎందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

Written by - Vishnupriya | Last Updated : Mar 7, 2025, 04:47 PM IST
Nagarjuna: కూలీ మూవీ నుండి నాగ్ డైలాగ్స్ లీక్.. విలనిజంతో రెచ్చిపోయారుగా..!

Nagarjuna Video:
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమా గత కొన్ని నెలలుగా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉన్నది. అయితే అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లను చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. ముఖ్యంగా నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర తదితర నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నాగార్జున ఒక డైలాగ్ చెప్పే సీను కి సంబంధించి లీక్ అయినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇందులో నాగార్జున మాస్ యాక్షన్ సన్నివేశానికి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది .విలన్ కు , నాగార్జునకు మధ్య ఫైట్ సీన్ జరిగిన సన్నివేశంగా కనిపిస్తోంది.. నాగార్జున చుట్టూ వందలాది మంది ఉండగా ఒక వ్యక్తిని చాలా క్రూరంగా కొడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే తమిళంలో డైలాగ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. 

చాలా స్టైలిష్ గానే కనిపిస్తూ ఉన్నారు నాగార్జున.. ముఖ్యంగా నాగార్జున మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వైట్ అండ్ వైట్లో నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ వీడియో లీక్ అయ్యి వైరల్ గా మారడంతో నాగార్జున ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

విక్రమ్ చిత్రంలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర లాగే నాగార్జున పాత్ర కూడా కూలీ సినిమాలో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఈ పాత్ర నాగార్జున కెరీయర్ కు ఉపయోగపడుతుందో చూడాలి. ఇప్పటివరకు చిత్ర బృందం కేవలం పోస్టర్లతోనే అదరగొట్టేశారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తూ ఉన్నారు. అయితే తెలుగులో మాత్రం ఇంకా నాగార్జున తన సినిమాని మొదలుపెట్టలేదు.

Read more: Romance Video: ఛీ.. ఛీ.. ఆఫీసులో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News