
Kubera Public Talk:
తెలుగు సీనియర్ హీరోలు అందరూ ఒక మూస ధోరణలో వెళుతుండగా.. నాగార్జున మాత్రం దీని నుంచి పక్క రూట్ కి వెళ్లడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కుబేర, కూలి సినిమాలో ఒప్పుకున్నట్లు అర్థమవుతుంది.
టాలీవుడ్ కింగ్ గా పిలుచుకొని నాగార్జున.. తాజా చిత్రం కుబేరలో తన నటనతో మరోసారి.. తన స్థాయిని నిరూపించుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ధనుష్, నాగార్జునల మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున నటన ప్రత్యేకంగా నిలిచింది అంటూ ఎంతో మంది ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రంలో నాగార్జున ఒక సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో కనిపించారు. తనకు సాధారణంగా వచ్చిన రొమాంటిక్ హీరో ఇమేజ్ను పక్కన పెట్టి, పూర్తిగా డీ గ్లామర్ లుక్‌తో నటించిన నాగ్ కొత్త అవతారంలో మెరిశారు. ఇలా మాస్ కమర్షియల్ సినిమాలు చేసే సమయంలో, కథ కోసం తన ఇమేజ్ను పక్కన పెట్టి పాత్రలో ఒదిగిపోయే ఆయన ధైర్యాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
విమర్శకుల నుంచి కూడా నాగార్జునకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్ళతోనే భావోద్వేగాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు అంటే కేవలం డైలాగులు చెప్పడమే కాదు, శరీర భాషతోనూ.. భావాన్ని వ్యక్తం చేయగలగాలి..అన్న విషయాన్ని ఈ పాత్రలో ఆయన చూపించారు.
శేఖర్ కమ్ముల సినిమాల్లో పాత్రలు సహజంగా ఉంటాయి. అలాంటి పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున తన సీనియర్ అనుభవాన్ని.. వినియోగిస్తూ శ్రద్ధగా నటించారు. కేవలం నటించడమే కాదు, ఈ సినిమా ప్రమోషన్ల బాధ్యతను కూడా తీసుకుని ప్రచారంలో భాగస్వామ్యం కావడం ఆయన కమిట్మెంట్ను చూపిస్తోంది.
ఈ చిత్రంలో నాగార్జున చేసిన పాత్ర ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆయన నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఈ పాత్రతో నాగార్జున మళ్లీ తన ఫుల్ ఫామ్‌కు తిరిగి వచ్చారని చెప్పొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook