Nagarjuna: మూలస్తంభాన్ని కోల్పోయిన అక్కినేని కుటుంబం.. ఎమోషనల్ అయినా నాగార్జున..

Akkinenis emotional moment: అక్కినేని వీరాభిమాని ఎద్దుల అయ్యప్ప రెడ్డి మరణించడంతో నాగార్జున ఎమోషనల్ ట్వీట్ చేశారు.  మా ఇంటి మూల స్తంభం మరణించారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక పెద్ద పోస్ట్.. షేర్ చేశారు ఈ హీరో. పూర్తి వివరాలులోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Feb 27, 2025, 02:50 PM IST
Nagarjuna: మూలస్తంభాన్ని కోల్పోయిన అక్కినేని కుటుంబం.. ఎమోషనల్ అయినా నాగార్జున..

Nagarjuna emotional post: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం అందరిని కలచివేసింది. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ఎక్స్ పేజ్ లో ఆయన తెలిపారు.  నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎంతో మంది ఇప్పటికీ నాగ్ కుటుంబంతోనే నడుస్తున్న విషయం తెలిసిందే.

Add Zee News as a Preferred Source

ఇక తన తండ్రి అభిమానులను కూడా నాగార్జున ఎంతో ప్రత్యేకంగా చూస్తారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్త తెలుసుకున్న నాగార్జున ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 

మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎద్దుల అయ్యప్ప రెడ్డి మరణించడం నన్ను కలచివేసింది.  ఆయన మా నాన్నగారికి వీరాభిమాని కూడా.. నాన్న నుంచే మాకు ఆయన మరింత దగ్గరయ్యారు.  అక్కినేని కుటుంబానికి మూల స్తంభంగా ఇన్నాళ్లపాటు నిలిచారు.  మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ , అభిమానం ఎప్పటికీ కూడా మరిచిపోలేను.

ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.  ఈ కష్ట సమయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే శక్తి దేవుడు వారికి అందిస్తాడు అని కోరుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ వేశారు నాగార్జున. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇక ఎద్దుల అయ్యప్ప రెడ్డి విషయానికి వస్తే..  ఈయన కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అటు అక్కినేని ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరగా ఉంటున్నారు. ఇక నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనులలో కూడా ఆయన అండగా ఉండేవారని తెలుస్తోంది. 

వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యం లో కూడా అయ్యప్ప రెడ్డి ముందుండే వారట. ఇక అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో కూడా ఆయన సందడిగా కనిపించేవారని, అటు అభిమానులు కూడా చెబుతూ ఉంటారు. అలాంటి ఈయన ఇప్పుడు మరణించడంతో నాగార్జున కుటుంబం మొత్తం ఎమోషనల్ అవుతోంది.

 

ఇదీ చదవండి: Anjeer: అంజీర్‌ పండును 2 ఇలా వాడితే.. ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

ఇదీ చదవండి: పాడవ్వకూడదని అల్లం వెల్లులి పేస్ట్ ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News