Aditya 369 re release Function: ఆదిత్య 369 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈయన ఈ సినిమా ముందు వరకు పలు చిత్రాలు తెరకెక్కించినా.. ఈ సినిమా తర్వాతే ఈయనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు దివంగత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పకుడిగా వ్యహరించారు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.
తెలుగులో తొలి టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణ దేవరాయలుగా.. కృష్ణ కుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.
ఈ సందర్భంగా ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన చిత్రం"ఆదిత్య 369". ఈ మూవీని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశామన్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గ ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారన్నారు చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు బాలయ్య రీసెంట్ గా ప్రకటించారు. మరోవైపు ఆదిత్య 369 తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ బాలయ్యతో .. వంశానికొక్కడు, భలేవాడివి బాసూ, మిత్రుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









