)
తెలుగులో తన తరంలో పలు ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేసిన బాలయ్య.. ఒకానొక సమయంలో వరస ఫ్లాపులతో సతమతమయ్యాడు. తన తర్వాత తరం తన సినిమాలతో పోటీకి వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టిన సందర్భాలున్నాయి. ఇక హీరోగా నరసింహ నాయుడు తర్వాత బాలయ్య దాదాపు దశాబ్దం వరకు సాలిడ్ హిట్ అన్నదే లేదు. మధ్యలో ‘లక్ష్మీ నరసింహా’ మాత్రమే హిట్ అనిపించుకుంది. కానీ బాలకృష్ణ అభిమానులు కోరుకున్న హిట్ మాత్రం దక్కలేదు. కానీ 2010లో బోయపాటి శ్రీను ‘సింహా’ సినిమాతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఆ తర్వాత ‘పరమవీరచక్ర’తో మళ్లీ ఫ్లాప్. అటు శ్రీరామరాజ్యం తో మళ్లీ హిట్ అందుకున్నారు.
అటు మధ్యలో వరుస ఫ్లాపులు వెంటాడాయి. మళ్లీ లెజెండ్ తో బాలయ్య జూలు విదల్చాడు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు వెంటాయి. ఒక క్రిష్ దర్శకత్వంలో వందో సినిమా నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు రూ. 50 కోట్ల షేర్ అందుకుంది. ఆ తర్వాత పైసా వసూల్ సినిమా ఫ్లాప్ అయినా.. అందులో బాలయ్య మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీ, టీవీల్లో ఈ సినిమా హిట్టైయింది.అటు జై సింహా ఓ మోస్తారు విజయం సాధించింది. ఆ తర్వాత తండ్రిపై చేసిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక కేయస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రూలర్’ కనీసం ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇక అఖండ నుంచి మళ్లీ బాలయ్య ఫామ్ లోకి వచ్చాడు.
ఆ తర్వాత బాలయ్య వెనుదిగిరి చూసుకోలేదు. ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’సినిమాలతో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నాడు. అటు అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి పెరిగింది. ఒకపుడు ప్రకటనలకు దూరంగా ఉన్న బాలయ్య.. వరుస యాడ్స్ తో చెలరేగిపోతున్నాడు. మొత్తంగా 60 ప్లస్ ఏజ్ లో ఈ రేంజ్ లో చెలరేగి పోతున్న హీరో బహుశా ఎవరు లేరు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేసాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అన్ని సినిమాల్లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించడం విశేషం.
అటు బాలకృష్ణ సమకాలికులైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఎవరు హిందీ సినిమాలు చేసినా.. తమ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పుకోలేదు. కానీ బాలయ్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అంతేకాదు బాలయ్య తన హిట్ సినిమాలకు సీక్వెల్ చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. బాలయ్యకు 19వ డ్యూయల్ రోల్ సినిమా. మరి ఈ సినిమాలో అఖండగా.. మురళీ కృష్ణగా కనిపించనున్నాడు. మరి ఈ సినిమా బాలయ్య తన హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. మొత్తంగా బాలకృష్ణ కెరీర్ అఖండ ముందు అఖండ తర్వాత అనే విధంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.