Pailam Pilaga Trailer: ఈ మధ్యకాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా.. మంచి కథ స్క్రీన్ ప్లే తో చాలానే చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద.. పెద్ద విజయాలు అందుకున్నాయి. తాజాగా ఈ దారిలోనే ఇప్పుడు మరొక చిన్న సినిమా.. సక్సెస్ దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఆ సినిమాని పైలం పిలగా. టైటిల్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమాకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. గతంలో చాలామంది సీనియర్ హీరోలతో.. యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఆనంద్ గుర్రం కి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిల్లా పిల్లగాడు అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న సాయి తేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. పావని కరణం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా నుండి సోడు సోడు అనే పాటను లాంచ్ చేశారు. ఆ పాటకి ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 


హరీష్ శంకర్ ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. టీజర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


విడుదల కి ముందే మంచి బజ్ సంపాదించిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మధ్యనే సినిమా టీజర్ ట్రైలర్ చూసిన నందమూరి బాలకృష్ణ కూడా చిత్ర బృందం మీద ప్రశంసల వర్షం కురిపించినట్లు సమాచారం. ముఖ్యంగా బాలయ్యకి డైలాగ్ చాలా బాగా నచ్చాయి అని.. ఈ సినిమా నటీనటులు, సాంకేతికవర్గం, షూటింగ్ విశేషాలను అడిగిమరీ తెలుసుకున్నట్లు సమాచారం. 


గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన మొట్టమొదటి యాడ్ కి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. అప్పటినుంచి వీరి స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు బాలయ్య. సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తూ.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


సొంత ఊరే ప్రపంచం అనుకునే అమ్మాయి.. ఆకాశమే తన హద్దు అనుకుంటూ ప్రపంచాన్ని జయించాలి అనుకునే ఒక అబ్బాయి.. వీళ్ళిద్దరూ ఈమధ్య ప్రేమకథ ఈ సినిమా. ఈస్ట్ వెస్ట్ మధ్య ఉండే తేడాలను హాస్యభరితంగా చూపించనుంది ఈ సినిమా. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.


Also Read: Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..


Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.