)
Balakrishna Special Birthday wishes to Pawan Kalyan: :సెప్టెంబర్ 2 1971లో పవన్ కళ్యాణ్.. అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. ఈ రోజు 53 యేళ్లు పూర్తి చేసుకొని 54వ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కు తెలుగు దేశం పార్టీ అగ్ర నేత.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ బర్త్ డే విషెస్ సామాజిక మాధ్యమం వేదికగా తెలియజేసారు.
నేనున్నది మీకోసం అంటూ జనం వైపు పయనం సాగించే జనసేన అధ్యక్షులు.. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి.. నా సోదరుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ బాలకృష్ణ విషెస్ తెలియజేసారు. అటు తన అన్నయ్య నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా అన్నకు నివాళులు అర్పించారు.
నందమూరి బాలకృష్ణ వాళ్ల నాన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘంగా కొనసాగినా.. 2014 ఎన్నికల్లో తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అంతేకాదు 2019, 2024 ఎన్నికల్లో కూడా వరుసగా మూడు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచి హాట్రిక్ సాధించారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా 2008లో ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాల్లో ప్రవేశించి .. 2014లో సొంతంగా జనసేన స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై .. చంద్ర బాబు నాయుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి ఆరో వేలులా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాకా.. ఆ పదవికి ఓ వన్నె వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.