)
HBD Balakrishna: తెలుగు సినీ ఇండస్ట్రీ కాదు కాదు.. దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి ఒకే ఫ్యామిలీ నుంచి పద్మ అవార్డులు అందుకున్న ఏకైక కుటుంబంగా నందమూరి తండ్రీ తనయులు రికార్డు క్రియేట్ చేసారు. ఇక నార్త్ లో హిందీలో కపూర్ ఫ్యామిలీ నుంచి తండ్రీ కొడుకులు ఈ పద్మఅవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో తండ్రి బాటలో హీరోగా తెరంగేట్రం చేసి తండ్రి తగ్గ తనయులుగా రాణించిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ రాణించినా.. అవార్డులు అందుకోవడం అంత ఈజీ కాదు. అలా ఒకే కుటుంబం నుంచి తండ్రీ కుమారులు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అవును అప్పట్లో 1968లో అన్న ఎన్టీఆర్ ని అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలో గవర్నమెంట్ పద్మశ్రీతో గౌరవించింది. ఆయనతో పాటు ఏఎన్నార్ కు కూడా పద్మశ్రీ ఒకేసారిప్రకటించడం విశేషం. దాదాపు 57 యేళ్ల తర్వాత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణుడయ్యారు. రీసెంట్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ అవార్డు అందుకోవడం విశేషం.
తండ్రి ఎన్టీఆర్ అప్పట్లో పద్మశ్రీ అందుకుంటే.. తనయుడు ఏకంగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి తండ్రీ తనయులు ఇద్దరు పద్మ అవార్డులు ఎవరు అందుకున్న దాఖలాలు లేవు. అదే హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్.. 1969లో పద్మభూషణ్ అవార్డు వరిస్తే.. ఆ తర్వాత ఆయన తనయుడు బాలీవుడ్ షో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్.. రెండేళ్లకే 1971లో పద్మభూషణ్ అవార్డు అందుకోవడం విశేషం. ఆ తర్వాత చాలా యేళ్లకు పృథ్వీరాజ్ కపూర్ చిన్న కుమారుడు.. రాజ్ కపూర్ చిన్న తమ్ముడు శశి కపూర్ ను 2011లో కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి నుంచి తండ్రీ కొడుకులు ముగ్గురు పద్మభూషణ్ అవార్డుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పౌర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో అది తెలుగులో నందమూరి తండ్రీ కొడుకులైన ఎన్టీఆర్, బాలకృష్ణలు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం వీరికే మాత్రమే దక్కింది. నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. నందమూరి తారకరామారావు, బసవ తారకం దంపతులకు ఎనిమిదో సంతానంగా చైన్నైలో జన్మించారు. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు. ఈయన 1960 జూన్ 10న జన్మించారు. కానీ హైదరాబాద్ లోనే పెరిగారు. అంతేకాదు 14 యేళ్ల వయసులో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ చిత్రంతో యాక్టర్ గా అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగకుండా నటుడిగా అనేకంటే హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు అంతేకాదు బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎక్కువ సినిమాల్లో టైటిల్ రోల్స్ చేయడం విశేషం.
హీరోగా 51 యేళ్ల నట ప్రస్థానంలో జానపద, పౌరాణిక, చారిత్రక, సోషల్, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్స్,హార్రర్ సినిమాల్లో నటించారు. ఈ యేడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక 65వ పుట్టినరోజు కానుకగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ టీజర్ తో పలకరించారు. పూర్తి మాస్ డేవోషనల్ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ మూవీ బాలయ్యకు తొలి ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న చిత్రమనే చెప్పాలి. తాజాగా ఈ టీజర్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. అటు గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ సినిమా ను ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అటు రజినీకాంత్, నెల్సన్ కాంబోలో వస్తోన్న ‘జైలర్ 2’ లో పవర్ ఫుల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ పుట్టినరోజున క్లారిటీ రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.