Movie Theatre: హీరో నానికి బిగ్‌ షాక్‌.. థియేటర్‌లో 'కోర్టు' సినిమా నిలిపివేత!

Movie Price Hike Movie Screening Stopped Suddenly: అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తున్న థియేటర్‌పై అధికారులు దాడి చేసి ప్రదర్శితమవుతున్న సినిమాను అడ్డుకున్నారు. దీంతో ప్రేక్షకులు నివ్వెరపోయారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2025, 07:15 PM IST
Movie Theatre: హీరో నానికి బిగ్‌ షాక్‌.. థియేటర్‌లో 'కోర్టు' సినిమా నిలిపివేత!

Nani Court Movie: సినీ హీరో నానికి అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న 'కోర్టు' సినిమాను అధికారులు అడ్డుకున్నారు. ప్రదర్శితమవుతున్న సినిమాను అకస్మాత్తుగా నిలిపివేశారు. అప్పటివరకు సినిమా చూస్తున్న ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళం చెందారు. అధికారులు సినిమాను అడ్డుకోవడంతో ప్రేక్షకులు విస్తుపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: CLAP Programme: మరో జగన్‌ పథకం ఎత్తివేత? కాకినాడలో నిరుపయోగంగా క్లాప్‌ వాహనాలు

నాని నిర్మాణంలో కోర్టు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అధికంగా టికెట్‌ వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా అమలాపురంలో వెంకటరమణ థియేటర్‌లో ప్రదర్శనను నిలిపివేశారు. అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తున్న థియేటర్‌పై అధికారులు దాడి చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు

సినిమా టికెట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై రెవెన్యూ అధికారులు స్పందించి తనిఖీలు చేశారు. వెంకటరమణ థియేటర్‌లో తనిఖీలు చేపట్టిన ఆర్డీఓ కె.మాధవి, ఎమ్మార్వో అశోక్ టికెట్‌ ధరలను పరిశీలించారు. 110 రూపాయలకు విక్రయించాల్సిన కోర్టు సినిమా టికెట్‌ను రూ.150 విక్రయిస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనికి తోడు థియేటర్ లైసెన్స్ రెన్యువల్ కూడా చేయలేదని గుర్తించారు. విచారణ పూర్తయ్యే వరకూ సినిమా నిలిపివేయాలని ఆర్డీఓ కె.మాధవి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా థియేటర్‌కు సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయించడంపై అధికారులు కొరడా ఝుళిపించడం ఏపీతోపాటు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News