Hit 3 Pre Relese Business:‘హిట్ 3’ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాని ముందున్న టార్గెట్ ఇదే..!

Hit 3 World Wide Pre Relese Business: ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని మంచి ఊపుమీదున్నాడు. వరుస హిట్ చిత్రాలతో  అదరగొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హాట్రిక్ హిట్స్ తో మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఈ రూట్లోనే  శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో హిట్ 3 మూవీతో పలకరించబోతున్నాడు. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ చేసింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2025, 11:01 AM IST
Hit 3 Pre Relese Business:‘హిట్ 3’ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాని ముందున్న టార్గెట్ ఇదే..!

Hit 3 World Wide Pre Relese Business: నాని నాచురల్ స్టార్ గా తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసాడు. కెరీర్ స్టార్టింగ్ లో  పక్కంటి అబ్బాయి తరహా పాత్రలతో అలరించిన నాని.. ఇపుడు మాసావతారం ఎత్తాడు. అంతేకాదు వరుసగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కోవలో  హిట్ కేస్ 3 మూవీతో ప్రేక్షలకు ముందుకు రాబోతున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమాగా ఇది రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ కు మంచి డిమాండ్ తో సేల్ అవుతున్నాయి.  

Add Zee News as a Preferred Source

తాజాగా నాని.. శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం.  ఇందులో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నాడు. పూర్తిగా శైలేష్ కొలను తన మార్క్ వయోలెన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా లోకల్ గుండాల నుంచి ఉగ్రవాదులను మట్టు పెట్టే అర్జున్ సర్కార్ పాత్రలో నాని తన మార్క్ హీరోయిజాన్ని తెరపై చూపించాడు. హిట్ ఫ్రాంచైజీతో పాటు నాని ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీగా అమ్ముడుపోయింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

నైజాంగా పిలుచుకునే తెలంగాణ రాష్ట్రంలో రూ. 13 కోట్లు.. సీడెడ్ పేరుతో పిలిచే రాయలసీమలో.. రూ. 5.40 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 15 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఈ సినిమా రూ. 33.40 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక + మిగిలిన భారత దేశంలో కలిపి రూ. 5.50 కోట్లు.. విదేశాల్లో రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులుకు ఎక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 50 కోట్ల షేర్ (రూ.100 కోట్ల గ్రాస్) రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ బిజినెస్ ను  క్రాస్ చేయడం ఈజీ అని చెప్పాలి. మొత్తంగా హిట్ 3 తో నాని తన జైత్రయాత్రను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News