Hit 3: మరి ఇంత వైలెన్స్ అయితే ఎలా నాని.. ఈ రక్తపాతం ఏంటి సామి.. !

HIT 3 Trailer Talk Review: ప్రస్తుతం నాని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హాట్రిక్ హిట్స్ తో మంచి ఊపుమీదున్నాడు. ఈ కోవలో ఇపుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 01:47 PM IST
Hit 3: మరి ఇంత వైలెన్స్ అయితే ఎలా నాని.. ఈ రక్తపాతం ఏంటి సామి.. !

HIT 3 Trailer Talk Review: నాని నాచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు పక్కంటి అబ్బాయి తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ ఇపుడు రూట్ చేంజ్ చేశాడు. తన నాచురల్ స్టార్ అనే బిరుదును పక్కన పెట్టి అన్ నాచురల్ గా మాస్ అవతారంతో చెలరేగిపోతున్నాడు. ప్రెజెంట్ తెలుగు హీరోలందరు చూసేదే నాని చేస్తున్నాడు. అంతేకాదు వరుసగా మాస్ సినిమాలతో తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు.

Add Zee News as a Preferred Source

తాజాగా నాని.. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ చేస్తున్నాడు. ఇందులో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పూర్తిగా శైలేష్ తన మార్క్ వయోలెన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా లోకల్ గుండాల నుంచి ఉగ్రవాదులను మట్టు పెట్టే అర్జున్ సర్కార్ పాత్రలో నాని తన మార్క్ హీరోయిజంతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా మాములు జనాలకు అర్జున్ అయితే.. విలన్స్ పాలిట సర్కార్ అని ఈ సినిమాలో డైలాగ్స్ పెట్టారు. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ధర్మ సంస్థాపన వైపు.. ధర్మ రక్షణ వైపు.. హీరో ఉంటాడనే  అనే డైలాగును ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో చెప్పించడం విశేషం.  

 
ఈ ట్రైలర్ లో మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్  పతాకంపై నాని, ప్రశాంత్ త్రిపుర్నేని నిర్మిస్తున్నారు. పూర్తి ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్ గా రాబోతుంది. ఈ సినిమా మే 1న రాబోతుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు సుజిత్ సినిమా కూడా లైన్ లో ఉంది.

 

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News