Hit 3 3 days Collections: నాని హిట్ 3 బాక్సాఫీస్ కలెక్షన్స్.. 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే..

Hit 3 Collections: నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’. ఈ సినిమా మొదటి రోజు నుంచే యునామస్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్నటితో మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంలో ఉందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 4, 2025, 07:07 PM IST
Hit 3 3 days Collections: నాని హిట్ 3 బాక్సాఫీస్ కలెక్షన్స్.. 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే..

Hit 3 Collections: నాచురల్ స్టార్ నాని వరుసగా సక్సెస్ ఫుల్  చిత్రాలతో మంచి ఊపుమీదున్నాడు. అంతేకాదు నాని సినిమాలకు తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఈ సినిమా నార్త్ అమెరికాలో $1.7 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి $ 2 మిలియన్స్ వైపు పరుగులు తీస్తోంది. ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయారు. తన పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. ఇక నార్త్ అమెరికాలో మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ ల తర్వాత  వరుసగా ఐదు $1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

Add Zee News as a Preferred Source

అంతేకాదు అమెరికా మార్కెట్ లో 11వ వన్ మిలియన్ యూఎస్ డాలర్స్ అందుకున్న మూవీగా హిట్3 నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు రూ. 43 కోట్ల గ్రాస్ వసూల్లతో నాని కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. మూడు రోజు శని వారం ఈ సినిమా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఈ సినిమా మూడో రోజు రూ. 9 కోట్ల షేర్ (రూ. 17 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల షేర్ (రూ. 75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఈ సినిమా మరో రూ. 10 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంటుంది. మొత్తంగా హిట్ 3 మూవీ నాని కెరీర్ లోనే మూడో రూ. 100 కోట్ల గ్రాస్ చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయి. గతంలో దసరా, సరిపోదా శనివారం సినిమాల తర్వాత హిట్ 3 బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News