Dasara 3 days Collection: దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్..? నాని దెబ్బకు బద్దలైన బాక్సాఫీస్

Dasara Overseas 3 days Collection: నాని దసరా సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నాని బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న నంబర్లను చూసి అంతా షాక్ అవుతున్నారు. నాని మాస్ మేనియాను మరోసారి చూపించినట్టు అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2023, 11:51 AM IST
  • బాక్సాఫీస్ వద్ద నాని సందడి
  • కోట్లు కొల్లగొడుతోన్న దసరా
  • ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్?
Dasara 3 days Collection: దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్..? నాని దెబ్బకు బద్దలైన బాక్సాఫీస్

Dasara Overseas 3 days Collection: నాని దసరా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్దడి సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్‌లో నాని దుమ్ములేపేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో నాని రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 1.4 మిలియన్‌ డాలర్లను వసూల్ చేసినట్టుగా తెలుస్తోంది.

మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు రోజుల్లోనే 53 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ప్రీమియర్, మొదటి రోజు కలిపి ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. అలా నాని రెండు మూడు రోజుల్లోనే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నాడు. నైజాం, ఓవర్సీస్‌ ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్‌ దాటేసినట్టుగా సమాచారం అందుతోంది.

దసరాకి మాస్ ఆడియెన్స్ మౌత్ టాక్ కలిసి వస్తోంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా, కాస్త నెగెటివ్ కామెంట్లు వినిపించినా కూడా కలెక్షన్లు మాత్రం మోత మోగిపోతోన్నాయి. దసరా సినిమాకు ఇప్పుడు తిరుగులేని విధంగా ఉంది. దసరాకు లాంగ్ వీకెండ్ బాగానే కలిసి వచ్చింది. దాదాపు నేడు కూడా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దసరా దుమ్ములేపేస్తోంది.

మూడు రోజుల్లో ఈ సినిమా దగ్గరదగ్గరగా 63 కోట్ల గ్రాస్, 37 కోట్ల షేర్ రాబట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక నేడు వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్నది తెలుస్తుంది. వీకెండ్‌లోపే బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం సోమవారం నుంచి వచ్చేదంతా లాభాలే అవుతాయి. అలా కాకుండా ఉండే.. వీక్ డేస్ కలెక్షన్లను బట్టే బ్రేక్ ఈవెన్ ఎప్పుడవుతుందనే ఆధారపడుతుంది.

శ్రీకాంత్ ఓదెల తీసిన ఈ మొదటి సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ తీసిన రంగస్థలం, పుష్పల ఛాయలు ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. సుకుమార్ దగ్గర పని చేయడంతో ఇలా ప్రభావం పడి ఉంటుందేమో. శ్రీకాంత్ ఓదెల మేకింగ్, టేకింగ్‌కు టాలీవుడ్ పెద్దలు సైతం ఆశ్చర్యపోతోన్నారని టాక్.

Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే

Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News