Nani Paradise: ది ప్యారడైజ్‌లో నాని అమ్మగా స్టార్ నటి.. ఇంతకీ ఆ డైలాగ్ చెప్పింది ఎవరంటే..?

Nani new movie: నాని ప్యారడైజ్‌ టీజర్ ఈ మధ్య విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది.. ముఖ్యంగా ఇందులోని ఒక డైలాగ్.. అసలు నాని సినిమాలో ఎలా పెట్టారు అని ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైలాగ్ చెప్పింది నాని అమ్మ కాగా.. ఆ పాత్రలో నటించబోతోంది ఎవరు అని అనుమానాలు కూడా ఎంతోమందికి ఉన్నాయి..

Written by - Vishnupriya | Last Updated : Mar 4, 2025, 01:08 PM IST
Nani Paradise: ది ప్యారడైజ్‌లో నాని అమ్మగా స్టార్ నటి.. ఇంతకీ ఆ డైలాగ్ చెప్పింది ఎవరంటే..?

Nani Paradise movie: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మాఫియా నేపథ్యంతో రూపొందనుంది. తాజాగా బాలీవుడ్, మరాఠీ సినీ నటి సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం.  

Add Zee News as a Preferred Source

సోనాలి కులకర్ణి గతంలో హిందీలో దిల్ ఛాహతా హై, భరత్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పటివరకు ఆమె తెలుగు సినిమాలో కనిపించలేదు. ది ప్యారడైజ్తో తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. సినిమాల్లో తల్లి పాత్రలు ప్రేక్షకులను బలంగా ప్రభావితం చేస్తాయని గతంలో బాహుబలి, సలార్ వంటి చిత్రాలు రుజువు చేశాయి. అదే తరహాలో, ఈ సినిమాలో కూడా ఆమె పాత్రకు కీలక ప్రాధాన్యత ఉందని సమాచారం.  

Paradise Mother Role: ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే, ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఇంటెన్స్ ఎమోషనల్ కథను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. నాని పాత్ర రఫ్, మాస్ మేనరిజం కలిగి ఉండగా, ‘రక్తం పోసి పెంచిన కొడుకు’ అనే డైలాగ్ కూడా సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎంత ప్రధానంగా నిలవబోతుందో సూచిస్తోంది. ఈ నేపథ్యంలో సోనాలి కులకర్ణి పోషించే తల్లి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది అని వినికిడి.  

Nani mother in Paradise: టాలీవుడ్‌లో తల్లి పాత్రలు ఎమోషనల్‌గా హిట్ అవుతాయి అనేది ఎంతోమంది భావన. గతంలో రమ్యకృష్ణ, నదియా, తదితర నటీమణులు మదర్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో, ది ప్యారడైజ్లో సోనాలి పాత్రను బలంగా రూపొందించినట్లు టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, కథలో కుటుంబ భావోద్వేగాలను మాఫియా యాక్షన్‌తో కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నారని తెలుస్తోంది. 

నాని, దసరా తర్వాత మళ్లీ మాస్ లుక్‌లోకి మారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో ది ప్యారడైజ్ ప్రత్యేకమైన సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ మిక్స్ చేసి ఈ కథను తెరకెక్కించనున్నారు. ఇక, సోనాలి కులకర్ణి ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తారనేది చూడాలి.  

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2025 మార్చి 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News