The Paradise Glimpse Review: నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ గ్లింప్స్.. వామ్మో మరి ఇంత పచ్చిగానా..!

Nani The Paradise Glimpse Review: నాచురల్ స్టార్ నాని.. ఇపుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. నిన్నమొన్నటి వరకు పక్కంటి అబ్బాయి తరహాలో నాచులర్ క్యారెక్టర్స్ చేసిన నాని.. ఇపుడు అందరి హీరోల మాదిరి మాస్ బాట పట్టాడు. ఈ కోవలో ఈయన హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను 5 భాషల్లో విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 12:00 PM IST
The Paradise Glimpse Review: నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ గ్లింప్స్.. వామ్మో మరి ఇంత పచ్చిగానా..!

Nani The Paradise Glimpse Review: నాచురల్ స్టార్ ఇపుడు అన్ నాచురల్ స్టార్ అయిపోతున్నాడు. అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హీరోగా ఎక్కువగా కాలం ఇండస్ట్రీలో ఉండాలంటే నాచురాలిటీని పక్కన పెట్టి మాస్ మంత్రం జపించాల్సిందే. అందురు హీరోలు చేసేదే ఇపుడు నాని అదే చేస్తున్నాడు. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. తాజాగా నాని తనకు ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ది ప్యారడైస్’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసారు.ఈ గ్లింప్స్ లో చరిత్రలో అందరు చిలుకలు, పావురాలు గురించి రాసిన్రు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. అందులో కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ. అమ్ము రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఒక దగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. తూ అనిపించుకున్న కాకులు.. తల్వార్లు పట్టినయ్.. ఇది కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ అని మొత్తంగా గ్లింప్స్ తోనే సినిమాపై హైప్ పెంచిండ్రు. 

Add Zee News as a Preferred Source

అన్యాయానికి గురైన ఒక జాతి .. ఎలా తల ఎగరేసుకొని ఎలా జీవించిందనే దానిపై తెరకెక్కిన కథ. మొత్తంగా నరకంలో బతుకుతున్న తన జాతి వాళ్లకు ఓ నాయకుడు సృష్టించిన స్వర్గం కథ అని చెప్పాలి. ప్యారడైజ్ అంటే స్వర్గం అనే అర్ధంలో ఈ సినిమాకు టైటిల్ పెట్టారు. ‘దసరా’ తర్వాత ఈ సినిమాను కూడా పూర్తి తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

ఈ గ్లింప్స్ చూస్తుంటే.. కేజీఎఫ్, ఛత్రపతి వంటి పాత సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉంది. ఒక బడుగు జాతికి చెందిన ప్రజల్లోంచి ఓ నాయకుడు పుట్టుకొచ్చి.. వాళ్ల జీవితాల్లో ఎలా వెలుగులు నింపాడనే కథ అని తెలుస్తోంది. 

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఈ సినిమాతో రీసెంట్ గా ‘హిట్ 3’ లో కూడా మాస్ కథానాయకుడిగా ఊర మాస్ పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టాడు. ‘ది ప్యారడైజ్’ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి రెండు విదేశీ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ చేస్తున్నారు. ఓ తెలుగు సినిమా డైరెక్ట్ గా ఒకేసారి విదేశీ భాషల్లో షూట్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News