Nanna Malli Rava: ఎమోషనల్ డ్రామా తో ఆకట్టుకోనున్న నాన్న మళ్ళీ రావా..!

Nanna Malli Rava movie:  తెలుగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే 'నాన్నా మళ్లీ రావా' సినిమా ప్రివ్యూ ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. సత్య ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నిర్దేష్ దర్శకత్వం వహించగా, డా. ఉమారావు నిర్మించారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కన్నీళ్లతో థియేటర్‌ను వీడారు. సినిమా కథ, నటన, దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంది.

Written by - Vishnupriya | Last Updated : Mar 22, 2025, 03:58 PM IST
Nanna Malli Rava: ఎమోషనల్ డ్రామా తో ఆకట్టుకోనున్న నాన్న మళ్ళీ రావా..!

Nanna Malli Rava Telugu movie: తెలుగు ప్రేక్షకులను భావోద్వేగంతో ముంచెత్తే మరో హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. క‌మ‌ల్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్దేష్ ద‌ర్శ‌క‌త్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో రూపొందిన 'నాన్నా మ‌ళ్లీ రావా..!' చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు కీలక పాత్రలు పోషించారు.  

Add Zee News as a Preferred Source

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రివ్యూ షో నిర్వహించగా, సినిమా చూసిన వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకులు కన్నీళ్లతో థియేటర్ నుంచి బయటకు రావడం చూసిన టీం సభ్యులు ఎమోషనల్ అయ్యారు.  

ఈ సందర్భంగా సీనియర్ నటుడు సత్యప్రకాశ్ మాట్లాడుతూ, “షూటింగ్ సమయంలో గ్లిజరిన్ అవసరం లేకుండా నిజమైన భావోద్వేగంతో కన్నీళ్లు తెప్పించుకున్నాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడి ప్రతిభ నన్ను ఆ లోకంలో ముంచెత్తింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా తీర్చిదిద్దారు” అన్నారు.  

దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ, “సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత అందరి స్పందన చూసి ఎంతో ఆనందం కలిగింది. నాన్న అనే అనుబంధం ప్రతి ఒక్కరికీ స్పెషల్. థియేటర్లో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా కట్టిపడేస్తుందని నమ్మకం ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నాం” అన్నారు.  

ఈ చిత్రంలో కేశవ్ పాత్రలో నటించిన రిత్విక్ మాట్లాడుతూ, “ఈ సినిమా నన్ను ఎమోషనల్ చేసింది. నాన్న పాత్రకు కలిగే విలువ నాకు మరింత బాగా అర్థమైంది. షూటింగ్ సమయంలో నా మనసుకు మిగిలిన అనుభవాలు జీవితాంతం నిలిచిపోతాయి” అన్నారు.  

ప్రేక్షకుల మనసులను తాకే సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత డా. ఉమారావు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సెన్సార్ పూర్తి చేసిన తర్వాత త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News