Nari Nari Naduma Murari Movie Collections:‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ కలెక్షన్స్..నేటి నుంచి లాభాల్లోకి..

Nari Nari Naduma Murari Movie Collections:2026 సంక్రాంతి బరిలో దాదాపు అర డజనకు ఒక్కటి తక్కువగా ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ప్రభాస్ ‘ది రాజాసాబ్’తో స్టార్ట్ అయిన పొంగల్ సినిమాలు.. శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ఎండ్ అయింది. చివర్లో వచ్చినా.. మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శర్వా. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 19, 2026, 07:40 AM IST
Nari Nari Naduma Murari Movie Collections:‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ కలెక్షన్స్..నేటి నుంచి లాభాల్లోకి..

Nari Nari Naduma Murari Movie Collections: సంక్రాంతి తీవ్ర పోటీలో విడుదలైన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సంక్రాంతి బరిలో చివరగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ‘మన శంకర వర్ ప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’ సినిమాల తర్వాత తెలుగులో మూడో హిట్ కు అందుకోవడం పక్కా. నిన్నటితో దాదాపు బ్రేక్ ఈవెన్ కు చేరువైన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా .. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని  హిట్ స్టేటస్ అందుకోబోతుంది. 

Add Zee News as a Preferred Source

'సామజవరగమన’ వంటి హిట్ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిల్లేరియస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింద. రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగింది. నిన్నటితో ఈ సినిమా రూ. 9.50 కోట్ల షేర్ (రూ. 17 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

శర్వానంద్ గత కొన్నేళ్లుగా హిట్ ముఖం చూసి చాలా కాలమే అయింది. తాజాగా ఇపుడు సరిగ్గా సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ క్లాసిక్ మూవీ టైటిల్  ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో  మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యేడాది మన తెలుగులోనే కాదు మన దేశంలో మూడో హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్తా మీనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నిలిచారు. శ్రీ విష్ణు కీలక పాత్రలో నటించారు.  రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు లాభాలను అందుకుంటుందో చూడాలి. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News