Director Harish sankar: జాతీయ మీడియా బాలుకు గౌరవం ఇవ్వలేదు

ప్రఖ్యాత గాయకుడు దివంగత బాల సుబ్రహ్మణ్యం మరణాన్ని జాతీయ మీడియా సరిగ్గా పట్టించుకోలేదా ? దర్శకుడు హరీష్ శంకర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి?

Last Updated : Sep 26, 2020, 09:19 PM IST
Director Harish sankar: జాతీయ మీడియా బాలుకు గౌరవం ఇవ్వలేదు

ప్రఖ్యాత గాయకుడు దివంగత బాల సుబ్రహ్మణ్యం ( Singer Bala subrahmanyam ) మరణాన్ని జాతీయ మీడియా సరిగ్గా పట్టించుకోలేదా ? దర్శకుడు హరీష్ శంకర్ ( Director Harish Shankar ) ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి?

ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ ( Indian playback singer ) సింగర్ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం దర్శకుడు హరీష్ శంకర్ లేవనెత్తిన అభ్యంతరం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దేశం గర్వించదగిన గాయకుడు బాలుకు జాతీయ మీడియా సరైన గౌరవం ఇవ్వలేదనేది హరీష్ శంకర్ చెబుతున్న మాట. సింగర్ బాలు ( Singer Balu ) మరణాన్ని జాతీయ మీడియా ( National media on Balu's death ) సరిగ్గా ప్రసారం చేయలేదని..దక్షిణాధి రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక కధనాలు ప్రసారమయ్యాయని అన్నారు. అంతర్జాతీయ మీడియా బీబీసీ ఇచ్చినంత ప్రాధాన్యత కూడా జాతీయ మీడియా ఇవ్వలేదని చెబుతూ..ఉదాహరణగా బీబీసీలో ప్రసారమైన ఓ కధనం వీడియోను షేర్ చేశారు. జాతీయ మీడియాను చూస్తుంటే జాలి వేస్తుందంటూ సెటైర్లు వేశారు. 

వాస్తవానికి ఇవాళ ముంబాయి డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case ) లో ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దీపికా పడుకోన్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. జాతీయ మీడియా మొత్తం ఈ అంశంపైనే దృష్టి సారించాయి. 

తమిళనాడు ( Tamilnadu ) ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నైలోని బాలు ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. కోవిడ్ ( covid 19 ) కారణంగా సినీ ప్రముఖులు చాలామంది అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఈ సందర్బంగా దక్షిణాది మీడియాలో బాలు గొప్పతనం, నేపధ్యం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కధనాలు ప్రసారమయ్యాయి. అదే సమయంలో జాతీయ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని దర్శకుడు హరీష్ శంకర్ ఆవేదన చెందారు. Also read: Bharat Ratna to SP Balu: గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి: అర్జున్

Trending News