28°C Movie Review: 28°C మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

28°C Movie Review: నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ ‘28°C’.  పూర్తి లవ్, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 4, 2025, 06:12 PM IST
28°C Movie Review: 28°C మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

మూవీ: 28°C
నటీనటులు: నవీన్ చంద్ర,ప్రియదర్శి పులికొండ,హర్ష చెముడు,షాలినీ వడ్నికట్టి,వి జయప్రకాష్,రాజా రవీంద్ర తదితరులు
ఎడిటర్ - గ్యారీ బీహెచ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - వంశీ పచ్చిపులుసు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - శ్రీచరణ్ పాకాల
సంగీతం - శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత - సాయి అభిషేక్
దర్శకత్వం - డా. అనిల్ విశ్వనాథ్

Add Zee News as a Preferred Source

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ఉష్ణోగ్రతను ప్రధానాంశంగా తెరకెక్కిన మూవీ  28°C.  ఈ చిత్రాన్ని ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

స్టోరీ విషయానికొస్తే..
ఓ అమ్మాయిని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసును  విచారించడానికి వచ్చిన పోలీస్ అధికారి (రాజా రవీంద్ర), డాక్టర్ కార్తీక్ (నవీన్ చంద్ర) ఈ మర్డర్ కు  కారణమని అనుమానిస్తాడు. కార్తీక్ ఇంట్లో అతనికి ఒక డైరీ  లభిస్తుంది. ఆ డైరీలో కార్తీక్, డాక్టర్ అంజలి (షాలినీ వడ్నికట్టి) లవ్ స్టోరీ ఉంటుంది. విశాఖలో మెడిసిన్ అభ్యసిస్తున్న కార్తీక్, అంజలిని లవ్ చేస్తాడు. వారు మ్యారేజ్ చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకునే సమయంలో, అంజలి తీవ్ర అనారోగ్యం పాలవుతుంది. ఆమె 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలదని డాక్టర్లు చెబుతారు. కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్, అంజలి జార్జియా ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? అక్కడ అంజలి హెల్త్ ఓకే అయిందా.. ?  కార్తీక్, అంజలి లైఫ్ ఎలాంటి మలుపు  తీసుకుంది ? అమ్మాయి హత్య కేసులో కార్తీక్ నిందితుడిగా ఎందుకు మారాడన్నదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విశ్లేషణకు వస్తే..

28°C టైటిల్  తోనే ఈ సినిమా వెరైటీ కథ అని చెప్పకనే చెప్పారు. దర్శకుడు కూడా ఈ సినిమాను  హీరోయిన్ 28°C  కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే ఆమె చనిపోతుందనే  కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసాడు. సాధారణంగా మన శరీరం 37°C లేదా 98.4 ఫారెన్ హీట్ వరకు తట్టుకుంటుంది. కానీ ఈ సినిమా హీరోయిన్  28°C  కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదని చెప్పి సినిమాలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండితెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఆ తర్వాత అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తో స్టోరీ మలుపులు తిరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ హీరో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం ఆహ్లాదకరంగా చూపించాడు. ముఖ్యంగా అంజలి కున్న రోగం తెలియడం.. ఆమెను కాపాడుకోవడం  కోసం హీరో చేసే ప్రయత్నాలు..గుండెలను హత్తుకుంటాయి.
 
ముఖ్యంగా జార్జియా వెళ్ళిన తర్వాత కార్తీక్, అంజలి లైఫ్ లో ఎలాంటి సంఘటనలను ఫేస్ చేసారనేది ఉత్కంఠ రేపేలా చేసింది.  దర్శకుడు డాక్టర్ కాబట్టి ఇలాంటి వైద్యపరమైన టెక్నికల్ ఇష్యూస్ బాగానే తెలుసు కాబట్టి దాన్ని బాగానే డీల్ చేసాడు. ఇందులో ఓ క్యారెక్టర్ సినిమా చూస్తేనే మజా ఉంటుంది.  28°C సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి . శ్రావణ్ భరద్వాజ్ పాటలు, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాత సాయి అభిషేక్ అభిరుచి మొదటి సినిమాలోనే తెలుస్తోంది. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మంచి భావోద్వేగభరితమైన ప్రేమ కథను తెరపై అంతే బాగా పండించాడు. అనిల్ విశ్వనాథ్ అతిథి పాత్రలో చిన్న సన్నివేశంలో కనిపిస్తారు.  

నటీనటుల విషయానికొస్తే..

నవీన్ చంద్ర ఎప్పటిలాగే తనదైన నటనతో మెప్పించాడు. ఆరేళ్ల క్రితం నాటి సినిమా కాబట్టి కాస్త యంగ్ గా ఫ్రెష్ గా కనిపించాడు. హీరోయిన్ గా నటించిన అంజలి తన పాత్రలో ఒదిగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

కొత్త తరహా కథ, కథనం
సెకండాఫ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

సెకండాఫ్ లో లాజిక్ లేని సీన్స్

రేటింగ్: 2.75/5

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News