Show Time Movie: భయపెట్టేందుకు వచ్చేస్తున్న నవీన్ చంద్ర.. 'షో టైమ్‌' ఫస్ట్ లుక్ అవుట్

Show Time Movie First Look Poster: ఉగాది పర్వదినం స్పెషల్‌గా షో టైమ్ మూవీ ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 30, 2025, 09:28 PM IST
Show Time Movie: భయపెట్టేందుకు వచ్చేస్తున్న నవీన్ చంద్ర.. 'షో టైమ్‌' ఫస్ట్ లుక్ అవుట్

Show Time Movie First Look Poster: నవీన్ చంద్ర హీరోగా.. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన మూవీ షో టైమ్. మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. శరత్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి సంభాషణలు రాస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండగా.. ఓ కుటుంబం అనుకోని చిక్కుల్లో పడితే.. ఎలా బయటపడ్డారనే కాన్సెప్ట్‌ను ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఎదురుగా పోలీస్.. అతని నుంచి తన కుటుంబాన్ని నవీన్ చంద్ర ఎలా కాపాడుకున్నాడనే కాన్సెప్ట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామాతోపాటు క్రైమ్ థ్రిల్లర్ కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ర ఇప్పటికే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించగా.. కామాక్షి భాస్కర్ల కూడా 'మా ఊరి పోలిమేరా'తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు జంటగా షో టైమ్ మూవీతో ప్రేక్షకులను మెప్పిస్తారని మేకర్స్ చెబుతున్నారు. పోస్టర్‌తోనే మూవీపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. 

కామాక్షి భాస్కర్ల వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. షో టైమ్ మూవీతోపాటు మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. అల్లరి నరేష్ హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ, పోలిమేర మూడో పార్ట్‌లో ఈ బ్యూటీ యాక్ట్ చేస్తోంది. 
డిఫరెంట్ కాన్సెప్ట్‌ మూవీలలో నటించడం కొత్తగా ఉందని.. తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలుతున్నానని ఆమె చెబుతున్నారు.  

Also Read:BRS Party Panchangam: మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ పంచాంగం ఎలా ఉందో తెలుసా?

Also Read: Sitara: మహేశ్ బాబు అందం నుంచి ఊడిపడిందా..? ముద్దుగుమ్మలా ఘట్టమనేని గారాలపట్టీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News