)
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న మన దేశంలో అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 అని చెప్పాలి. మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. అదే ‘నయనం’. ఈ ఒరిజినల్ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలతో ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు ఈ సిరీస్ ట్రైలర్ తో చూపించారు.
లేటెస్ట్గా ఈ ఒరిజినల్ ఫస్ట్ లుక్‌ను జీ 5 రిలీజ్ చేసింది. దీంతో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలుబడింది. ఈ ఒరిజినల్లో ఆరు ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కానున్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపంచనున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో చూపించాడు.
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘నటుడిగా నాకు ఇది న్యూ జర్నీగా అభివర్ణించారు. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. పోస్టర్‌ను గమనిస్తే నా క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ అర్థమవుతుందన్నారు. ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయ్యిందని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 19న జీ 5లో ప్రీమియర్ కానున్న ‘నయనం’ ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.