)
Akhanda 2 Thandavam Teaser Records: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను తెలుగులో బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత వీళ్ల కాంబోలో రాబోతున్న నాల్గో చిత్రం ‘అఖండ 2 తాండవం’. హీరోగా బాలయ్య తన బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఆదిత్య 369 కు సీక్వెల్ చేస్తానని చెప్పినా.. అది ఇంకా మెటీరీలైజ్ కాలేదు. ఇక బాలకృష్ణ 65 యేళ్ల వయసులో ఆయన నుండి వస్తోన్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
గతంలో ‘భగవంత్ కేసరి’ సినిమా హిందీ వెర్షన్ కు తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు. కానీ ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాలేదు. కేవలం ఓటీటీ వేదికగా ప్యాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది.కానీ ‘అఖండ 2’ సినిమా మాత్రం ప్యాన్ ఇండియా భాషల్లో సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఓకేసారి ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లో తెలుగులో 22.33 మిలియన్ వ్యూస్ తో తెలుగులో సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. లైక్స్ పరంగా 531.5K మార్క్ ను అందుకొని రికార్డుల రచ్చ లేపింది. అంతేకాదు గతంలో చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా 24 గంట్లో 20.95 మిలియన్ వ్యూస్ అందుకోగా.. దాన్ని అఖండ 2 దాటేసింది. లైక్స్ పరంగా 516.5 K లైక్స్ తో ఆచార్య టాప్ లో ఉండగా.. దాన్ని అఖండ 2 తాండవం మూవీ 15 వేల లైక్స్ లీడ్ తో దాటేసింది.
ఈ చిత్రాన్ని విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈయన కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా మూవీతో పాటు బాలయ్య కెరీర్లో తొలి సీక్వెల్ ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు రచ్చ చేస్తుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook