Nee Dharey Nee Katha: నీ దారే నీ కథ.. వైవిధ్యమైన కథతో.. రేపు విడుదల కాబోతున్న సినిమా..

This Week Theatrical Releases: వైవిద్యమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు నీ దారే నీ కథ అనే చిత్రం.. ఇలానే ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం.. రేపు జూన్ 14వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది.. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మీకోసం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 13, 2024, 07:19 PM IST
Nee Dharey Nee Katha: నీ దారే నీ కథ.. వైవిధ్యమైన కథతో.. రేపు విడుదల కాబోతున్న సినిమా..

Nee Dharey Nee Katha: 

వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో..సంగీత ఆధారిత కథ తో రాబోతున్న సినిమా నీ దారే నీ కథ..ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూ.. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి అపురూపమైన ఎమోషన్స్ ని ఈ చిత్రం మనకు అందించనుంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌ లా.. ఈ సినిమాని ఫీల్ అవుతారు అని చెబుతున్నారు ఈ సినిమా యూనిట్. 

కాగా ఈ సినిమాని ప్రీమియర్ షో నిన్న వేయగా… చూసిన కొంతమంది ప్రముఖులు, ఆర్టిస్టులు.. ఈ చిత్రం చాలా బాగుందని ప్రశంసించారు. సినిమాలో తండ్రి కొడుకులు.. బంధాన్ని కూడా ఈ సినిమాలో.. చాలా బాగా చూపించారని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో కొత్తవారైనా ప్రతి ఒక్కరి నటన బాగున్నాయని.. అందరూ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద.. ఎసెట్టుగా నిలుస్తుంది అని చెబుతున్నారు అందరూ.

ఈ ప్రీమియర్ షో సందర్భంగా దర్శకుడు నిర్మాత వంశీ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : ‘ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్న.. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు.. సినిమా గురించి చాలా మంచిగా గా మాట్లాడారు. ఇప్పుడు ప్రీమియర్ లో ఈ సినిమా చూసినవారు.. సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రేపు ఈ మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రేక్షకులు కూడా ఈ మూవీని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

 కాగా ఈ సినిమాలో..సీనియర్ యాక్టర్ సురేష్ గారు, విజయ విక్రాంత్, అనంత పద్మశాల,ప్రియతమ్ మంతిని, అంజన బాలాజీ, వేద్.. ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News