Nenu Keerthana Amazon Prime: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘నేను-కీర్తన’ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది.
చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) కథ, దర్శకత్వం, నటనలో భాగస్వామ్యం అయ్యారు. అమెరికా నుండి చిమటా జ్యోతిర్మయి సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా 99 రూపాయల రెంట్‌తో అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సినిమా చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
వైవిద్యమైన జోనర్ తో వచ్చిన ఈ సినిమా కథ అందరిని ఆకట్టుకుంటుంది హలవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, హర్రర్ ఇలా అన్నీ కలిపి రూపొందించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను అన్ని కోణాల్లో ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో కథ సాగడంతో, ఈ సినిమా జనానికి మరింత దగ్గరవుతోంది. హీరో జానీ పాత్రలో చిమటా రమేష్ బాబు నటన ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.
ఈ సినిమాలో హీరో జానీ.. అన్యాయాలను ఎదుర్కొంటూ, ఇతరులకు సాయం చేసే యువకుడిగా కనిపిస్తారు. అలాంటి సమయంలో కీర్తన అనే యువతి జీవితంలోకి వస్తుంది. ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే కీర్తన ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిన జానీ ఆమెను రక్షించేందుకు ఎలా కృషి చేశాడన్నదే.. కథాకథనానికి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఫీల్ గుడ్ గా నడవడం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో రిషిత, మేఘన లాంటి నటీమణులు తమ పాత్రల ద్వారా ఆకట్టుకున్నారు. అలాగే రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ వంటి నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో హిమాలయాల కొలిమన కుల్లు-మనాలిలో చిత్రీకరించిన దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రముఖమైనవి.
ఈ సినిమా IMDbలో 8.9 రేటింగ్‌ను, BookMyShowలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలో ఈ సినిమాకి వస్తోన్న వ్యూస్ చూస్తూ ఉంటే..ఈ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ స్పష్టంగా అర్థమవుతుంది.
ఓ మంచి కథ, బలమైన కథనతత్వం, సాంకేతికంగా శ్రద్ధగా రూపొందించిన ‘నేను-కీర్తన’.. థియేటర్స్ లోనే కాకుండా..ఓటీటీలో కూడా మంచి విజయం సాధించింది. మంచి కంటెంట్‌కి ఎప్పుడూ ప్రేక్షకుల మద్దతు ఉంటుందని మరోసారి నిరూపించిందీ చిత్రం.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









