Rowdy Baby Mashup: బ్యూటీస్ విత్ బ్యూటీ ఫుల్‌ వాయిస్..షేక్ చేస్తున్న 'రౌడీ బేబి' మాషప్ సాంగ్

సూపర్ హిట్ సౌత్ సాంగ్  'రౌడీ బేబీ', సూపర్ హిట్ నార్త్ సాంగ్  ‘మణికే మాగే హితే..’ మాషప్  చేస్తే... అది కూడా ఇద్దరు అందమైన అమ్మాయిలు గిటార్ వాయిస్తూ పాట పాడితే.. సింప్లీ సూపర్బ్.. వింటే మీ మనసుకు ఒక హాయ్ కలుగుతుంది.. మారేందుకు ఆలస్యం ఓ లుక్కేయండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 05:59 PM IST
  • నెక్స్ట్ లెవెల్ "రౌడీ బేబి" మాషప్ సాంగ్
  • వీడియో చూస్తే మైమరచిపోవటం ఖాయం
  • సోషల్ మీడియాని చెక్ చేస్తున్న వీడియో
Rowdy Baby Mashup: బ్యూటీస్ విత్ బ్యూటీ ఫుల్‌ వాయిస్..షేక్ చేస్తున్న 'రౌడీ బేబి' మాషప్ సాంగ్

 Rowdy Baby x Manike Mage Hithe Mashup Song: ఒకటేమో సౌత్ ఇండియా సూపర్ హిట్ సాంగ్ మరొకటి, నార్త్ ఇండియా సూపర్ హిట్ సాంగ్ మాషప్ చేసి పాడితే.. ?? అది కూడా ఇద్దరు అందమైన అమ్మాయిలు గిటారు వాయిస్తూ.. అద్భుతమైన హస్కీ వాయిస్ తో పాడితే.. ఇంకేం ఉంది..? మాములుగానే మనోళ్లు కళాపోషకులు. ఈ వీడియో చూసాకా.. వేరే లెవల్ లో ట్రెండ్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మరియు షార్ట్ వీడియో యాప్ లలో తెగ ట్రెండ్ అవుతుంది.  యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ ఎక్కడ చూసిన ఈ పాట హావానే కొనసాగుతుంది. యోహాని డి సిల్వా అనే శ్రీలంకకు చెందిన ర్యాపర్ తన హస్కీ వాయితో పాడిన ఈ పాట  ఖండాలను దాటి, ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. 

Also Read: PM Modi US Tour: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఆమె గెలుపు చారిత్రాత్మకం

మన తమిళ హీరో ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన మారి-2 సినిమాలోని ‘రౌడీ బేబీ’ (Roudy Baby Song) పాట ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఎక్కడ చూసిన ఇదే పాట... ఆ సమయంలో యూ ట్యూబ్ నే షేక్ చేసిన ఈ పాటను, బాలీవుడ్ లో చాలా ఫేమస్ సింహళ పాట ‘మణికే మాగే హితే’  (Manike Mage Hithe Song) పాటను కలిపి మాషప్ చేసిన ఈ వీడియో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.    

యోహాని డి సిల్వా పాడిన ఈ పాటలో వారి హస్కీ వాయిస్, మ్యూజిక్ కాంపోజిషన్, పాటకు తగ్గట్టు ముఖ కదలికలు.. మొత్తంగా సూపర్బ్...  ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ అభిమానులను షేక్ చేస్తుంది. ఇప్పటికి ఈ వీడియోకు 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. వాయిస్ మాడ్యులేషన్ సూపర్.., ఎక్స్‌లెంట్, సూపర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్.. సింప్లీ సూపర్బ్ అని నెటిజన్లు కామెట్స్ చేస్తున్నారు. మరేందుకు ఆలస్యం వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి!

Also Read: T20 World Cup in 2007: భళా భారత్... చారిత్రాత్మక విజయానికి 14 ఏళ్లు.. అలనాటి జ్ఞాపకాలు మీకోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

More Stories

Trending News