Niharika Konidela: నటి కమ్ నిర్మాత నిహారిక కొణిదెల గతేడాది ‘కమిటీ కుర్రళ్లు’ సినిమా నిర్మించింది. ఈ సినిమాతో యదు వంశీ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాతో చాలా మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా ఇపుడు మానస శర్మ అనే కొత్త అమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో మ్యాడ్ సినిమాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో అట్రాక్ట్ చేసిన యువ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సంగీత్ సోలో హీరోగా నటించనున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
ఇది వరకే నిహారిక రూపొందించిన పలు వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి డైరెక్టర్ గా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకోబోతుంది. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో లీడ్ రోల్లో నటించారు.
New project. New story. Same love for cinema. ❤️
Stay tuned for what’s next ! Can you guess the genre though??#PEP2@IamNiharikaK #SangeethShobhan #ManasaSharma #MaheshUppala @manyam73 @PinkElephant_P @Ticket_Factory pic.twitter.com/pW7o1WF1ef
— Beyond Media (@beyondmediapres) April 2, 2025
ఈ చిత్రానికి మానస శర్మ స్టోరీని అందిస్తోంది. మహేష్ ఉప్పాల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) పీఆర్వోగా పనిచేస్తున్నారు. టికెట్ ఫ్యాక్టరీ ఈ సినిమా మార్కెటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









