Niharika: ఆ హీరోని బుట్టలో పడేయడం చాలా ఈజీ.. అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడు.. మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక కొణిదెల తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండిస్తూ, ఒక హీరోతో తనకు మంచి అనుబంధమే ఉన్నప్పటికీ..పెళ్లి అనే విషయం అసలు లేదని స్పష్టం చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి చూద్దాం..  

Written by - Vishnupriya | Last Updated : Mar 9, 2025, 05:18 PM IST
Niharika: ఆ హీరోని బుట్టలో పడేయడం చాలా ఈజీ.. అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడు.. మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Niharika second marriage:
మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఆమె, నిర్మాణ రంగంలో అడుగుపెట్టి విజయాన్ని సాధించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి, వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

నిహారిక 2020లో ఐపీఎస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్యను వివాహం చేసుకున్నారు. అయితే, వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు, చివరికి విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివిధ రకాల ప్రచారాలను చూసి నిహారిక అప్పట్లో మౌనం పాటించారు.  

టాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులు విడాకుల అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అలాంటి సమయంలో నిహారిక రెండో పెళ్లిపై కూడా రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు నటుడు వైష్ణవ్ తేజ్‌తో పెళ్లి జరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, నిహారిక ఈ వార్తలను ఖండించారు.  

తాజా ఇంటర్వ్యూలో నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కుర్రాళ్లందరిలో క్రేజీ ఎవరు?’ అని యాంకర్ అడగగా, "బన్నీ (అల్లుఅర్జున్) హైపర్ యాక్టివ్, ఎనర్జీ వేరే లెవల్" అని చెప్పింది. అదే విధంగా, "ఎవరినైనా బుట్టలో పడేయడం ఈజీ" అని ప్రశ్నించగా, వైష్ణవ్ తేజ్ అని పేర్కొంది. "ఏం చెప్పినా నమ్మేస్తాడు, అంతేకాదు అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడు" అంటూ నవ్వులు పూయించింది.  

నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ వెబ్‌సిరీస్ పెద్ద విజయం సాధించింది. ఆమె తన సినీ ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

నిహారిక వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమె రెండో పెళ్లిపై వచ్చే వార్తలపై నిరాధార ప్రచారాలు చేయొద్దని క్లారిటీ ఇచ్చారు. ఇక వైష్ణవ్ తేజ్‌తో తనకు మంచి అనుబంధమే ఉన్నట్లు, కానీ పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పడం గమనార్హం.

Also Read: Fixed Deposit Interest Rate: SBI, PNB లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా...ఏ ప్రభుత్వ బ్యాంకు FD పై అత్యధిక వడ్డీని ఇస్తోంది?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News