Robinhood Review: ‘రాబిన్ హుడ్’ మూవీ రివ్యూ.. నితిన్, వెంకీ కుడుముల కాంబో మెప్పించిందా.. !

Robinhood Review: హీరో నితిన్ కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘ఛలో’ మూవీ తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ‘ఛలో’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ మూవీ చేసాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 3, 2026, 07:07 PM IST
Robinhood Review: ‘రాబిన్ హుడ్’ మూవీ రివ్యూ.. నితిన్, వెంకీ కుడుముల కాంబో మెప్పించిందా.. !

మూవీ రివ్యూ: రాబిన్ హుడ్  (Robinhood)
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో తదితరులు
సంగీతం:  జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: : కోటి
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని
దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేది: 28-3-2025

Add Zee News as a Preferred Source

రాబిన్ హుడ్ అంటే ఉన్నవాళ్లను దోచుకొని లేని వాళ్లకు పెట్టే మంచి దొంగ. ఈ నేపథ్యంలో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో ఎన్నో చిత్రాలొచ్చాయి. సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో అదే ‘రాబిన్ హుడ్’ టైటిల్ తో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ ఏంటంటే..?

రామ్ (నితిన్) ఓ అనాథ కాగా.. శుభలేక సుధాకర్ నడుపుతున్న అనాథశ్రమంలో పెరుగుతుంటాడు. అయితే ఆ అనాథశ్రమానికి విరాళాలు లేకపోవడంతో పిల్లలకు అన్నం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. శుభలేక సుధాకర్ సాయం కోసం ప్రయత్నించినా..  అందరూ ఆశ చూపించి వెనక్కిపోతారు. ఈ నేపథ్యంలోనే రామ్ దొంగగా మారతాడు. బడా బాబులు ఇళ్లలో దోచుకుని పేదోళ్లకు పంచిపెడుతుంటాడు. రాబిన్ హుడ్‌ నిక్‌ నేమ్‌గా పెట్టుకుని.. వరుసగా దొంగతనాలు చేస్తుంటాడు. రాబిన్‌హుడ్‌ను పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా విక్టర్ (షైన్ చాం టాకో)ను ప్రభుత్వం నియమిస్తుంది. తాను దొరికిపోతే అనాథశ్రమాలను ఇబ్బందులకు గురిచేస్తారని భావించిన రాబిన్‌హుడ్.. ఇక దొంగతనాలు మానేసి ఉద్యోగం కోసం జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్)కు సంబంధించిన ఇండియాస్ నెంబర్ వన్ అనే సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. ఈ ఏజెన్సీ పేరుకు నెంబర్ వన్ అయినా.. కాంట్రాక్టులు లేక వెలవెలబోతుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కూతురు నీరా వాసుదేవ్ (శ్రీ లీల) భారత్ కు  వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఆమెకు సెక్యూరిటీ కోసం జాన్ స్నోకు కాంట్రాక్ట్ అప్పగిస్తాడు వెన్నెల కిషోర్. నీరా వాసుదేవ్‌ను రామ్, జాన్ స్నో అండ్ టీమ్ రుద్రకొండకు తీసుకువెళతారు. అక్కడికి వెళ్లిన తరువాత వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి..? నీరా వాసుదేవ్‌ను సామి (దేవదత్తా నాగే) ఎందుకు అక్కడికి రప్పించాడు..? రామ్‌కు సామికి ఉన్న గొడవలు ఏంటి..? డేవిడ్ భాయ్‌గా నటించిన డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి..? వంటి వివరాలు తెలియాలంటే రాబిన్‌హుడ్ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

రాబిన్ హుడ్ అనే టైటిల్ అంటేనే మంచి దొంగ అని అర్ధం వచ్చేలా ఈ సినిమాకు టైటిల్ పెట్టేసి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అనాథశ్రమంలో పిల్లలను ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో అందులో చదువుకొని పెరిగి పెద్ద అయిన ఓ కుర్రాడు రామ్ (నితిన్) పెద్దోళ్లను కొట్టి అనాథ పిల్లలకు సాయం చేస్తుంటాడు. ఈ కాన్సెప్ట్.. దాన్ని రాసుకున్న విధానాన్ని మెచ్చుకోవాలి. వెంకీ కుడుముల ఈ సినిమాను సాదాసీదా యాక్షన్ మూవీగా తెరకెక్కించవచ్చు. కానీ ఈ సినిమాకు తన మార్క్ హాస్యాన్ని దట్టించి తెరకెక్కించాడు. ఏది అతి లేకుండా ఎక్కడా ఏమి కావాలో అన్ని సరిసమానంగా చూసుకున్నాడు. ముఖ్యంగా అనాథ పిల్లలకు సరైన సాయం అందకపోవడంతో హీరో దొంగ మారడాన్ని కన్విన్సింగ్ గా ఉంటుంది. మరోవైపు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ల కామెడీతో సినిమాను నిలబెట్టాడు. సినిమాలో హీరోయిన్ ఎంట్రీ తో కథ పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ మోస్తరుగా ఉన్నా.. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఈ సినిమాను తన కామెడీతో ఈ సినిమాను భుజాలపై మోసాడు. వెంకీ కుడుముల తన పెన్ను పవర్ ఏంటో చూపించాడు. సెకండాఫ్ లో అంతా రొటీన్ కథ, కథనంతో ముగించినా.. కామెడీతో టైమింగ్  అక్కడ ట్విస్టులతో  మాత్రం మధ్యలో గంజాయి సాగు వంటివి ఇందులో చొప్పించి ఓవరాల్ గా  మెప్పించాడు. ఇక విలన్ పాత్రను ఇంకాస్త ఇంపాక్ట్ గా చూపించి ఉంటే బాగుండేది.  సాంగ్స్ పై మరింత దృష్టిపెట్టాల్సింది.  ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

నితిన్, శ్రీలీల తమ మార్క్ నటనతో మెప్పించారు.  రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ సినిమాను తమ కామెడీతో నిలబెట్టారు. వీళ్లద్దరి మధ్య వచ్చే ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. శుభలేఖ సుధాకర్ నటన బాగుంది. డేవిడ్ వార్నర్ స్క్రీన్ ఎంట్రీ  అదిరిపోయింది. అయితే ఆయన రోల్ ను మరో పార్ట్ కోసం తీసినట్లు అర్థమవుతుతంది.  మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
 
పంచ్ లైన్: మెసెజ్ కూడిన ఫన్ రైడర్ ‘రాబిన్ హుడ్’..

రేటింగ్: 2.5/5

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News