Nithya Menon Leg Fracture: నిత్యమీనన్ కు గాయాలు.. నడవలేని స్థితిలో హీరోయిన్.. ఏమైందంటే?
Nithya Menon Leg Fracture: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిత్యామీనన్, తనకు గాయాలయ్యాయని ప్రస్తుతానికి నడవలేక పోతున్నాను అనే విషయాన్ని వెల్లడించింది.
Nithya Menon Reveals About Her Leg Fracture: కర్ణాటకలో సెటిలైన మలయాళీ జంటకు జన్మించిన నిత్యామీనన్ కన్నడ సినిమా రంగం ద్వారా సినీ నటిగా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో తెలుగు నుంచి అలా మొదలైంది అనే ఆఫర్ రావడంతో ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన ఆమె ఎందుకో కానీ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈ మధ్యనే భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా తనకు గాయాలయ్యాయని ప్రస్తుతానికి నడవలేక పోతున్నాను అనే విషయాన్ని నిత్యామీనన్ వెల్లడించింది.
ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించిన నిత్యామీనన్ తరువాత మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఒక వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఆది పినిశెట్టి, నిత్యా మేనన్, మాళవికా నాయర్, రీతూ వర్మ, అభిజీత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జులై 8న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్‌లో ప్రముఖ నటులు సుహాసిని, రేవతి తదితరులు కూడా నటించగా ప్రేమలోని విభిన్న పార్శ్వాలను తాకే ఈ కథకు నగేశ్ కుకునూర్, వెంకటేశ్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికలు దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం నిత్యామీనన్ నడుచుకుంటూ రాలేకపోవడంతో ఆమె సపోర్టింగ్ స్టిక్స్ తో వేదిక వద్దకు చేరుకున్నారు. ఆమెను కింద నుంచి వేదిక మీదకు ఇద్దరు బౌన్సర్లు సాయం పట్టి తీసుకుని వెళ్లారు. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు బౌన్సర్లు సాయంతో స్టేజి మీదకు వచ్చారు అని వేడుకకు హాజరైన జర్నలిస్టులు ప్రశ్నించడంతో తాను రెండు రోజులు ముందు మెట్లు దిగుతూ కింద పడ్డానని ఆ సమయంలో తన కాలికి గాయమైందని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ట్రైలర్ చూడాలి అనే ఉద్దేశంతో రెస్ట్ కూడా తీసుకోకుండా తాను ఈ ఈవెంట్ కి వచ్చాను అనే విషయాన్ని ఆమె వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్‌లో నేను ఎల్బో క్రచ్‌తో నటించానన్న ఆమె నాకు నిజ జీవితంలోనూ ఇప్పుడు అదే జరిగిందని, స్లిప్ అయి పడిపోవడంతో ఇప్పుడు ఎల్బో క్రచ్‌తో ఇబ్బంది పడుతున్నానని ఆమె పేర్కొంది. ఇక నిత్యామీనన్ ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా ఆహ్వానం ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ ఇప్పటికే ముగియగా మొదటి సీజన్ విన్నర్ గా వాగ్దేవి నిలిచింది.
Also Read:Allu Arjun No.1 : సౌత్ లో దుమ్మురేపిన అల్లు అర్జున్.. అందరినీ వెనక్కు నెట్టి ముందుకు
Also Read: Ambika Rao no more : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నటుడి మరణం మరువక ముందే అంబికా మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.