Arjun S/O Vyjayanthi: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీకి టీజర్ కు ముహూర్తం ఫిక్స్..

Arjun S/O Vyjayanthi: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్  డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాతగా తన గట్స్ ఏంటో  చూపెడుతున్నాడు. అంతేకాదు రెగ్యులర్ హీరోల్లా కాకుండా రొటీన్ కు భిన్నంగా ఉండే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా విజయ శాంతి మరో లీడ్ రోల్లో  ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు  అర్జున్ S/O వైజయంతి (Arjun S/O Vyjayanthi) టైటిల్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 01:00 PM IST
Arjun S/O Vyjayanthi: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీకి టీజర్ కు ముహూర్తం ఫిక్స్..

Arjun S/O Vyjayanthi: కళ్యాణ్ రామ్ బింబిసారతో తన కెరీర్ లోనే బిగ్గెస్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత  అమిగోస్, డెవిల్ సినిమాలతో పలకరించాడు. ఈ సినిమా స్టోరీస్ బాగానే ఉన్నా.. ఎందుకో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.  ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడితో ‘అర్జున్ S/O వైజయంతి’ అనే సినిమా చేస్తున్నాడు. మహిళా దినోత్సవం రోజున ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడం విశేషం.  ఇప్పటికే టైటిల్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈ చిత్రంలో విజయ శాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఈ సినిమాపై హైప్స్ పెరిగేలా చేశారు. తాజాగా హోళి పండగ సందర్భంగా ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేశారు. అందులో సముద్ర తీరంలో కూర్చొన్న కళ్యాణ్ రామ్ విజువల్స్ చూపించారు. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 17న రిలీజ్ చేయనున్నారు.

Add Zee News as a Preferred Source

వరుసగా రెండు ఫ్లాపుల  తర్వాత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్‌ రామ్..ఇపుడు ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రంలో పవర్ఫుల్ మాస్ రోల్లో కనువిందు చేయనున్నాడు.  ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ శాంతి మరోసారి వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ తల్లిగా ఈ పేరు హైలెట్ గా ఈ సినిమా టైటిల్ పెట్టడం విశేషం. కర్తవ్యం సినిమాలో కూడా విజయ శాంతి .. వైజయంతి ఐపీఎస్ పాత్రలో నటించడం విశేషం. అందుకే ఈ సినిమాలో ఆమె పేరును వైజయంతి పేరు పెట్టడం విశేషం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. సోహా అలీ ఖాన్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్‌ కాకుండా ప్రీక్వెల్ బింబిసార 2 చేస్తున్నాడు.  బింబిసార కథ ముందు జరిగిన స్టోరీతో ఈ సినిమా రానుంది.  ఈ సినిమాను వశిష్ఠ కాకుండా అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News