
Arjun S/O Vyjayanthi: కళ్యాణ్ రామ్ ఒక మూసకు పరిమితం కాకుండా.. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో పలకరిస్తూనే ఉన్నాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు రెగ్యులర్ హీరోల్లా కాకుండా రొటీన్ కు భిన్నంగా ఉండే మూవీలనే సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా విజయ శాంతి మరో లీడ్ రోల్లో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా అర్జున్ S/O వైజయంతి (Arjun S/O Vyjayanthi). తాజాగా విడుదల చేసిన టీజర్ లో ముందుగా విజయశాంతిపై కట్ చేశారు. విజయశాంతి ఇందులో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కు సంబంధించిన పోలీస్ అధికారి పాత్రలో నటించారు. అంతేకాదు తనలాగే తన కుమారుడు అర్జున్ విశ్వనాథ్ (కళ్యాణ్ రామ్) కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలన్నదే ఆమె కల.
మరి వైజయంతి కలగన్నట్టు అర్జున్.. పోలీస్ కాకుండా క్రిమినల్ అయ్యాడా.. ? సమాజంలో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులను ఓ సామాన్యుడిలా ఎలా ఎదర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించినట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యేలా తెరకెక్కించాడు. విజయశాంతి పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో లేడీ సూపర్ స్టార్ ఈ పాత్ర చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ కూడా విజయశాంతితో కనెక్ట్ అయ్యేలా పెట్టారు.
NANDAMURI KALYANRAM - VIJAYASHANTHI: 'ARJUN S/O VYJAYANTHI' TEASER UNLEASHED... A mother's duty... A son's fury... Witness the epic face-off... #ArjunSonOfVyjayanthiTeaser is LIVE.#ASOVTeaser ?: https://t.co/Uw3AkEvP3G#ArjunSonOfVyjayanthi – the action-thriller [#NKR21]… pic.twitter.com/dLaM2nxm66
— taran adarsh (@taran_adarsh) March 17, 2025
అంతేకాదు టీజర్ లో మాస్, యాక్షన్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో విజయ శాంతి మరోసారి వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ తల్లిగా ఈ పేరు హైలెట్ గా ఈ సినిమా టైటిల్ పెట్టడం ఈ సినిమాపై క్రేజ్ పెరిగేలా చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోహా అలీ ఖాన్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ బింబిసార 2 చేస్తున్నాడు. బింబిసార కథ ముందు జరిగిన స్టోరీతో ఈ సినిమా ప్రీక్వెల్ గా రాబోతుంది.ఈ సినిమాను బింబిసారను డైరెక్ట్ చేసిన వశిష్ఠ కాకుండా అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe