War 2 Teaser: వార్ 2 టీజర్ విడుదల.. జూ.ఎన్టీఆర్ అభిమానుల అనుమానం తీరినట్టేనా..!

Jr NTR in War 2: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ ని విడుదల చేశాడు సినిమా యూనిట్. ఒక నిమిషం కన్నా ఎక్కువ నిడివితో వచ్చిన ఈ టీజర్.. ఎన్టీఆర్ అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : May 20, 2025, 02:54 PM IST
War 2 Teaser: వార్ 2 టీజర్ విడుదల.. జూ.ఎన్టీఆర్ అభిమానుల అనుమానం తీరినట్టేనా..!

Jr NTR Birthday Special : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ ఏడాది తమ స్టార్ హీరో..పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఆయ‌న జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన "వార్ 2" టీజర్ ఇప్పుడు ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మల్టీ స్టారర్‌గా రూపొందుతోంది.

Add Zee News as a Preferred Source

ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ నటించిన మొదటి భాగం "వార్" మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వార్ 2 తో ఆ స్థాయి ఇంకా పెరగనుంది అన్నది టీజర్ చూసిన వెంటనే అర్థమవుతుంది.

 

టీజర్ ప్రారంభంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది – “నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాయి కబీర్...” అనే సంభాషణతో టీజర్ సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఈ డైలాగ్‌తోపాటు నిండైన యాక్షన్ సన్నివేశాలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఎన్టీఆర్.. హృతిక్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి.

సరిగ్గా ఒక నిమిషం 34 సెకన్ల ఈ టీజర్ దృశ్యాలన్నీ స్టైలిష్‌గా, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబడినట్లు అనిపిస్తుంది. రెండు ఇండస్ట్రీల భారీ హీరోల కలయిక, అద్భుతమైన విజువల్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. 2025 ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ అభిమానుల మదిలో ఒక చిన్న అనుమానం ఉండేది.. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువగా ఉండొచ్చు అని అలానే.. హృతిక్ మెయిన్ హీరోగా ఉండడం వల్ల ఎన్టీఆర్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా చూపియ్యరేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ టీజర్ చూస్తే.. హృతిక్ రోషన్ కి ఏం అర్థం తగ్గకుండా ఎన్టీఆర్ నిదర్శకుడు తెరకెక్కించారని అర్థమవుతుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వార్ సినిమా ఎన్టీఆర్ ఫుల్ లెన్త్ సినిమానే అని.. క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 

ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా వచ్చిన ఈ టీజర్ అభిమానులకే కాదు, అన్ని వర్గాల సినీప్రియులకు ఓ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. మరి ఈ సినిమా విడుదల ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రెజ్ ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళుతుందేమో వేచి చూడాలి.

Also Read:  రాజ్‌భవన్‌లో భారీ చోరీ.. హెల్మెట్‌తో కంప్యూటర్‌ రూమ్‌లోకి వెళ్లింది ఎవరు తెలుసా?

Also Read: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ఎవరినీ నమ్మకూడదు, ఆకస్మిక ధనలాభం పొందే రాశి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News