Narne Nithin Marriage: ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బ్రదర్ నార్నె నితిన్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నార్నె నితిన్. తాజాగా శివానికి మూడు ముళ్లు వేసిన నితిన్.. ఓ ఇంటివాడయ్యాడు.
గత సంవత్సరం నవంబర్ 3న నార్నె నితిన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప కూతురు అయిన శివాని తాళ్లూరిని ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి చేసుకున్నాడు.
గత నవంబర్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరుగగా ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. నార్నె నితిన్, శివాని పెళ్లి వేడుక అక్టోబర్ 10న రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
ఇక బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కూడా హాజరై సందడి చేశారు. బామ్మర్ పెళ్లిలో ఎన్టీఆర్ సందడి చేసిన వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ పెళ్లి నుంచి కొన్ని వీడియోలు లీక్ అవ్వగా.. అధికారికంగా వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు ఎపుడు వస్తాయా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
#JrNTR from #NarneNithin's wedding !!
— Filmy Tollywood (@FilmyTwoodOffl) October 10, 2025
Also Read: Anupama Parameswaran: నీలం రంగు డ్రెస్‌లో నెమలిలా అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు చూశారా..?
Also Read: Priyanka Mohan: చీరలో మెరిసిపోతూ క్యూట్‌గా కవ్విస్తున్న ప్రియాంక మోహన్.. ఫొటోలు వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









