NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్..

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు. గతేడాది ‘దేవర’ మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో మంచి సక్సెస్ అందుకున్న తారక్.. ఇపుడు అదే ఊపుతూ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. తాజాగా తారక్.. షూటింగ్ లో ఎపుడు జాయిన్ అయ్యేది మేకర్స్ రివీల్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2025, 12:58 PM IST
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్..

NTR - Prashanth Neel: ప్రెజెంట్ తెలుగు సహా సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా లేట్ అవుతూ వస్తోంది. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కోల్ కతా సెట్ లో షూటింగ్  స్టార్ట్ చేశాడు.  ఈ సినిమాను కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో1970, 1980 నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇక ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అయినా.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు షూట్ లో పాల్గొనలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఈ నెల 22 ను నుంచి జాయిన్ కానున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

అప్పటి నుంచి కంటిన్యూగా మూడు షెడ్యూల్స్ లో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయనున్నాడు.  ఎన్టీఆర్.. దేవర పార్ట్ 1 జపాన్ రిలీజ్ సందర్బంగా బిజీగా ఉండటంతో పాటు కొన్ని పర్సనల్ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు తారక్ ఎంట్రీతో ఈ సినిమా ను శరవేగంగా కంప్లీట్ చేసే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

మరోవైపు ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఈ సినిమాలో తారక్.. ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు తరహాలో ఎన్టీఆర్, హృతిక్ లపై ఈ పాటను పిక్చరైజ్ చేయనున్నారు. అయాన్  ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News