NTR On Mad Square Success Meet: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్.. గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర పార్ట్ -1’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. కానీ ప్రభుత్వం అనుమతులు రద్దు చేయడంతో ఆ ఈవెంట్ కాన్సిల్ అయింది. ఆ తర్వాత సినిమా సక్సెస్ మీట్ నిర్వహిద్దామనుకున్నా.. ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇలా అభిమానులతో అట్రాక్ట్ కావాలనుకున్న ఎన్టీఆర్ కు గతేడాది నిరాశే ఎదురైంది. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో అభిమానులను నేరుగా కలిసారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా నవ్వించే చిత్రాలు తెలుగు చిత్రసీమలో మరిన్ని రావాలని ఆకాంక్షించారు.
మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా అభిమానులను కలిసే అవకాశం ఇచ్చిన నాగవంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాలు మరిచిపోతాము. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడన్నాడు. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి అభినందనలు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్ల షేర్ (రూ. 60 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి దూసుకుపోతుంది.
ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం మాములు విషయం కాదు. ఒక దర్శకుడిగా కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దన్నారు. ఇలాంటి హాస్య భరిత చిత్రాలు మరిన్ని తెరకెక్కించాలని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా ఈ చిత్రంలో తండ్రి పాత్రను చేసిన మురళీధర్ గారు అద్భుతంగా నటించారు. ఒక క్యారెక్టర్ ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానిని నిజమైన పర్ఫామెన్స్ యాక్టర్ ఇవ్వగలిగినప్పుడు ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్ గా నాకు తెలుసు. ఈ సినిమాకి పిల్లర్ లా నిలిచిన మురళీధర్ కి కంగ్రాట్స్. అలాగే ఆంథోనీ. సినిమా చూస్తూ, అతను ఎంటర్ అయినప్పుడు నేను కూడా చప్పట్లు కొట్టాను. మ్యాడ్-1 లో ఆంథోనీ అంటే దేంతోని అంటారు. నేను మరిచిపోలేని క్యారెక్టర్ అది. ఒక కామెడీ చేయగలిగిన క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోలా ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేను.
అలాగే లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదేమో అనిపించింది. నన్ను అందరూ అడుగుతుంటారు రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే కష్టమని చెబుతాను. ఎందుకంటే ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం మన నిజ జీవితంలో. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదన్నారు.
సంగీత్ ని, వాళ్ళన్నయ్య సంతోష్ ని చూస్తే.. నాకు వాళ్ళ శోభన్ గారే గుర్తుకొస్తారు. నేను శోభన్ గారిని ఒకసారి కలిశాను. ఆయనంత హంబుల్ గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదన్నారు. శోభన్ మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడేవారన్నారు. మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్ గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. మ్యాడ్ లో రామ్ నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నానన్నారు. రామ్ నితిన్ కి మంచి భవిష్యత్ ఉంది. నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లాడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉందన్నారు.
మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమాలో సత్యం రాజేష్, కార్తికేయ కామెడీకి కూడా బాగా నవ్వుకున్నాను. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరం తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడు సునీల్. భాష మీద పట్టు ఉంది. అలాగే కింద స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చారు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్ళీ నవ్వుకున్నాను. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతాను. సంగీత దర్శకుడు భీమ్స్ కి, గీత రచయిత కాసర్ల శ్యామ్ కి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు గారి చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్నగారితో చెప్పాను. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటానన్నారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









