
NTR- Prashanth Neel Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం.. రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. దేవర సినిమా వచ్చిన దగ్గరనుంచి జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం పైన అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచం మొత్తం.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం కోసం ఎదురుచూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్.. సినిమా తర్వాత ఈ హీరోకి పాన్ ఇండియా పరంగా క్రేజ్ వచ్చింది.
మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్, సలార్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ దర్శకుడు కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్లో వస్తుందా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఇటీవల వరకు ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ అప్పటికే పలు పెద్ద సినిమాలు ఆ తేదీకి విడుదలకు సిద్ధంగా ఉండటంతో, సినిమాకు సరైన డేట్ దొరకదని భావించిన మేకర్స్ జూన్‌కు మారినట్లు సమాచారం. దీంతో సంక్రాంతి రేసు నుంచి ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది.
మరోవైపు, శ్రుతిహాసన్ ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్.. చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘సలార్’లో ఆమె పాత్రను ఎక్కువగా చూపించలేకపోయిన నీల్, ఈ సినిమా ద్వారా మంచి స్కోప్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించకపోయినా, ఈసారి మినహాయింపు ఉండవచ్చని టాక్.
ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబోపై అభిమానుల్లో ఉన్న హైప్‌కి తగినట్టుగానే ప్రమోషన్లు కూడా ఉండే అవకాశం ఉంది.
See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c
— Jr NTR (@tarak9999) April 29, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe