O Andala Rakshasi: ఆసక్తి రేకిస్తోన్న ‘ఓ అందాల రాక్షసి’ ట్రైలర్.. మార్చ్ 21న విడుదల..

O Andala Rakshasi Trailer Talk: ఈ మధ్య కాలంలో తెలుగు సహా ఇతర భాషల్లో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ  లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం ‘ ఓ అందాల రాక్షసి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే మంచి ఆదరణ లభిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 12:30 PM IST
O Andala Rakshasi: ఆసక్తి రేకిస్తోన్న ‘ఓ అందాల రాక్షసి’ ట్రైలర్.. మార్చ్ 21న విడుదల..

O Andala Rakshasi Trailer Talk: డైరెక్టర్ గా.. కథానాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రెజెంట్ తెలుగు ప్రేక్షకుల  ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే మూవీతో  హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు కథానాయికలుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మించారు. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షెరాజ్ మెహదీ సమర్పణలో రాబోతుంది.  

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం ‘ఓ అందాల రాక్షసి’  షూటింగ్ కంప్లీటైంది. ప్రస్తుతం ఈ మూవీ  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. మార్చ్ 21న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.  ఈ క్రమంలో టైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ జానర్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజువల్స్, కెమెరా వర్క్ చాలా రిచ్ గా కనిపిస్తుంది.

షెరాజ్ మెహది యాక్టింగ్, మేకింగ్, టేకింగ్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. హారర్ మూమెంట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. టైలర్ లో చివరి షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. భాష్య శ్రీ ఈ సినిమాకు కథను అందించారు. మాటలు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. త్వరలోనే రాబోతున్న ఈ చిత్రంపై ట్రైలర్ ఒకసారిగా అంచనాలు పెంచేసింది.

ఈ చిత్రంలో  విహాన్షి హెగ్డే, సుమన్,  షెరాజ్ మెహదీ, కృతి వర్మ, నేహా దేశ్‌పాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, అనంత్ బాబు, ప్రియా, కృష్ణ ఇతర లీడ్ పాత్రల్లో నటించారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News