Odela 2 Movie First Review: ‘ఓదెల 2’ మూవీ తమన్నా మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Odela 2 Movie First Review: గత కొన్నేళ్లుగా తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తున్నాయి. ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. అందులో కాస్త కంటెంట్ ఉంటే చాలు ఆ క్రేజ్ తో ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ  కోవలో తెలుగులో వస్తోన్న మరో మూవీ ‘ఓదెల 2’. తమన్నా లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ  సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2025, 12:20 AM IST
Odela 2 Movie First Review: ‘ఓదెల 2’ మూవీ తమన్నా మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Odela 2 Movie First Review:  తమన్నా  లీడ్ రోల్లో సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఓదెల 2’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో చేశారు. అంతేకాదు అక్కడి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. తమన్నా ఈ సినిమాలో లేడీ అఘోరి పాత్రలో నటించింది. గోదావరి తీర ప్రాంతంలో  ఓదెల గ్రామంలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

Add Zee News as a Preferred Source

అప్పట్లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇందులో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిన డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మంచి రికవరీ సాధించిన ఈ సినిమా థియేట్రికల్ గా మంచి జోరు చూపిస్తోంది.

అంతేకాదు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.  తెలంగాణలో రూ. 3.5 కోట్లు.. రాయలసీమ.. రూ. 1 కోటి.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 4 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ అన్ని కలిపి ఈ సినిమా రూ. 2 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సినిమా రూ. 11కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇతర భాషల్లో ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ గా హిట్ అనిపించుకోవాలంటే రూ. 12 కోట్లు రాబట్టాలి.

ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమా అద్బుతంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అఘోరిగా తమన్నా ఎంట్రీ తర్వాత సినిమా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు. కొన్ని సీన్స్ అరుంధతి సినిమాను గుర్తుకు వచ్చేలా ఉన్నాయంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News