OG Kanmani: పవన్ కల్యాణ్ భార్యగా ప్రియాంక? 'OG'లో హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం!!

Pawan Kalyan OG Heroine Poster Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ' (OG) ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. ఈ సినిమాలోని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పోస్టర్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

Written by - Harish Darla | Last Updated : Aug 16, 2025, 05:47 PM IST
OG Kanmani: పవన్ కల్యాణ్ భార్యగా ప్రియాంక? 'OG'లో హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం!!

Pawan Kalyan OG Heroine Poster Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ' (OG) ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే పవర్‌ఫుల్ పాత్రలో తెరపై కనిపించనున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక మోహన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫైర్ స్ట్రోమ్ సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. విడుదల తేది దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో ఆగస్టు 16 (శనివారం) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కణ్మణి అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  

అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను తుఫానుతో పోలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ 'తుఫానుకు ప్రశాంతత అవసరం' అనే క్యాప్షన్ తో రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో ఓజీ చిత్రబృందం రిలీజ్ చేసింది. అందులో ఆమె చీరకట్టుతో ఆకట్టుకుంటూ నుదుటన తిలకం పెట్టుకుని ఉంది. ఇందులో ఆమె హీరో భార్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని మీద పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల విడుదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం మిశ్రమ స్పందన లభించడంతో 'ఓజీ' సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బాస్టర్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇప్పటికీ సినిమా కొనుగోలు కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు చిత్ర బృందాన్ని కలిసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇదో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అత్యధిక వసూలు చేసిన సినిమాగా ఇది నిలవబోతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు

Also Read: EPFO Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు తెలుసా?

Also Read: Mother Marries Son: కొడుకుని పెళ్లి చేసుకున్న తల్లి..మరో ఇద్దరు బిడ్డల్ని కనింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News